»   » మేం ఇలా చేయటం ఉపాసనకి నచ్చలేదు : రకుల్ ఇలా ట్వీటర్ లో

మేం ఇలా చేయటం ఉపాసనకి నచ్చలేదు : రకుల్ ఇలా ట్వీటర్ లో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాదులో తమన్నా పుట్టిన రోజు ఘనంగా జరిగింది. 'ధృవ' విజయంతో మంచి జోరుమీదున్న రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అఖిల్, ఉపాసనతో ఆనందంగా గడిచిపోయిందని తమన్నా తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇంకా పుట్టినరోజు ఫీలింగ్ లోనే ఉన్నానని తమన్నా పేర్కొంది. ఈ సందర్భంగా చెర్రీతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫోటోను తన ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసింది.ముద్దుగుమ్మలు రకుల్ ప్రీత్ సింగ్, తమన్నాలతో కలసి చరణ్ బయట పార్టీ చేసుకొన్నాడు. ఈ పార్టీలో యంగ్ హీరో అఖిల్ అక్కినేని కూడా ఉన్నాడండోయ్. ఈ పార్టీలో ఆ పార్టీలో రకుల్, తమన్నా కలిసి ఇలా గ్రీన్ టీ సేవించార‌ట‌. గ్రీన్ టీ విషయం ప్రక్కనపెడితే.. హీరోయిన్స్ తో కలసి చరణ్ ఎంజాయ్ చేశాడన్న న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

ఇక విషయానికి వస్తే రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, అఖిల్, రాంచరణ్ కలిసి పార్టీ చేసుకున్నారట. ఆ పార్టీలో రకుల్, తమన్నా కలిసి ఇలా గ్రీన్ టీ తాగారు. వీళ్లు టీ తాగితే పరవాలేదు కాని ఈ విషయం రాంచరణ్ భార్య ఉపాసనకు నచ్చలేదని తన ట్విట్టర్ అకౌంట్లో పెట్టింది రకుల్. ఇంతకి వీళ్లు గ్రీన్ టీ తాగితే ఉపాసనకు ఎందుకు నచ్చలేదో? అని మరీ ఎక్కువ అలో చించకండి తనను వదిలేసి ఇలా ఈ ఇద్దరు భామలే టీ తాగెయ్యటం ఉపాసనకి అలక తెప్పించిందట మరీ పెద్ద గొడవేం లేదక్కడ.

Rakul Preet singh, Tamanna had fun at Milky beauty Birth day bash

అంతే కాదు లేటెస్ట్ గా తన ఫామిలీ, ఫ్రెండ్స్ తో బర్త్ డే జరుపుకున్న తమన్నా ఇంకా అదే మోడ్ లో ఉన్నానంటూ మరో ఫోటో ట్వీట్ చేసింది. ఈ ఫోటో లో తమన్నా తో కేక్ కట్ చేయించారు రామ్ చరణ్, అఖిల్, రకుల్. ఈ ముగ్గురితో పాటు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల కూడా ఈ పార్టీ లో పాల్గొన్నారట. ఈ ఫోటోలతో ఈ నలుగురికి స్పెషల్ థాంక్స్ తెలుపుతూ తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది ఈ వైట్ బ్యూటీ.

Rakul Preet singh, Tamanna had fun at Milky beauty Birth day bash

తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ పై ఓ సారి లుక్కేస్తే.. ఇద్దరి మధ్య కొన్ని సిమిలారిటీస్ కనిపిస్తాయి. తమన్నా కూడా కెరీర్ స్టార్టింగ్‌లో స్మాల్ హీరోలతో స్టెప్పులేసింది. అక్కడ ప్రూవ్ చేసుకున్నాకే టాలీవుడ్ స్టార్ హీరోల సరసన ఆఫర్లు దక్కించుకుంది. సేమ్ టు సేమ్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా అంతే. లాస్ట్ ఇయర్ వరకు రకుల్ రొమాన్స్ చేసింది అంతా అప్ కమింగ్ హీరోస్ తోనే. ఈ ఏడాదే లక్ కలిసొచ్చి బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాల్లో నటిస్తూ కేక పుట్టిస్తోంది. ఇలా కెరీర్ విషయంలో ఇద్దరికీ పోలికలు ఉన్నా.. ఓ విషయంలో మాత్రం తమ్మూను ఫాలో అయిపోతోంది రకుల్.

Rakul Preet singh, Tamanna had fun at Milky beauty Birth day bash

యాక్టింగ్, గ్లామర్ పరంగా ఎ-1 అనిపించుకున్న తమన్నా.. డ్యాన్స్ విషయంలో యావరేజ్ అనిపించుకుంది. అందుకే ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌తో స్టెప్పులేయడానికి బాగానే హోం వర్క్ చేసి బెస్ట్ డ్యాన్సర్ అనిపించుకుంది. ప్రస్తుతం ఈ ముగ్గురితో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ కూడా.. డ్యాన్స్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటోందని టాలీవుడ్ సినీజనాలు మాట్లాడుకుంటున్నారు. బ్రూస్ లీ మూవీలో డ్యాన్స్ మూమెంట్స్ విషయంలో ఇంప్రూవ్ అయినట్లు కనిపిస్తున్న ఈ ఢిల్లీ బ్యూటీ.. యంగ్ టైగర్, బన్నీ సినిమాల్లోనూ కత్తిలాంటి స్టెప్పులతో కిరాక్ పుట్టించేందుకు రెడీ అవుతోందట.

English summary
Tamanna Birthday Party Images 2016. Celebrities Rakul Preet singh, Tamanna, Ram Charan Tej, Akhil Akkineni had fun at Milky beauty Birth day bash. Check it out images of the party.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu