»   » సూపర్ స్టార్‌తో రకుల్ ప్రీత్ సింగ్ (ఫోటో)

సూపర్ స్టార్‌తో రకుల్ ప్రీత్ సింగ్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రకుల్ ప్రీత్ సింగ్ తక్కువ కాలంలోనే పాపులర్ అయిన హీరోయిన్. ప్రస్తుతం అమ్మడు తెలుగులో స్టార్ హీరోల సినిమాలతో పాటు బాలీవుడ్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా గడుపుతోంది. ఆ మధ్య బ్రూస్ లీ సెట్స్ కి షారుక్ ఖాన్ వచ్చాడు. అపుడు షారుక్ తో కలిసి ఫోటో దిగడంపై ఆనందం వ్యక్తం చేస్తూ రకుల్ సోషల్ మీడియా ద్వారా ఫోటో షేర్ చేసింది.

యమ స్పీడు రకుల్....
మోడలింగ్ రంగం నుండి వచ్చిన అమ్మాయిలు, లేదా హీరోయిన్లు తమ అందాల కొలతల గురించి మాట్లాడటానికి ఏ మాత్రం వెనకాడరు. అయితే మోడలింగ్ రంగం కాకుండా డైరెక్టుగా సినిమా రంగంలోకి వచ్చిన హీరోయిన్లు మాత్రం ఈ విషయం గురించి పబ్లిక్ గా చర్చించడానికి తటపటాయిస్తారు.

ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలిగి పోతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల ట్వీట్టర్లో అభిమాని అడిగిన ప్రశ్నకు వెంటనే సమాధానం ఇచ్చింది. ఆ అభిమాని అడిగింది ఆమె సెక్సీ అందాల కొలతల గురించి కావడం గమనార్హం. ‘మీరు ఎప్పటికైనా సైజ్ జీరో ను ప్రిపర్' చేస్తారా? అని ఓ అభిమాని రకుల్ కు ప్రశ్న సంధించాడు.

Rakul Preet Singh with Shah Rukh Khan

అభిమాని ప్రశ్నకు రకుల్ ప్రీత్ సింగ్ సమాధానం ఇస్తూ...‘సైజ్ జీరో ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నేనే సైజ్ 6' అంటూ సమాధానం ఇచ్చింది. మహిళల్లో సైజ్ సిక్స్ అంటే 31-24-36 కొలతలు అని అర్థం. తమ సైజుల గురించి హీరోయిన్లు ఇలా ఓపెన్ గా మాట్లాడటం చాలా అరుదు. రకుల్ ప్రీత్ సింగ్ ఇలాంటి విషయాల్లో డేరింగే అని చెప్పొచ్చు.

కొందరు అభిమానులు ఆమెను ఐ లవ్ యూ, నీవు ఎలాంటి వాళ్లతో డేటింగ్ చేస్తావ్ అంటూ రొమాంటిక్ ట్వీట్స్ తో నానాహంగామా చేస్తున్నారు. అలాగే ఎప్పుడూ రాత్రిళ్లే కలలోకి వస్తుంటావ్ ఎందుకని ఓ అభిమాని అడిగిన కొంటె ప్రశ్నకు.. తెలివిగా సమాధానం చెప్పింది అమ్మడు. రోజంతా షూటింగ్ లో బిజీగా ఉంటాను కదా.. అందుకే రాత్రిళ్లే కల్లోకి వస్తా అని షాకింగ్ ఆన్సర్ ఇచ్చి అదరగొట్టింది రకుల్. లుక్స్ లోనే కాదు.. లౌక్యం తెలిసిన అమ్మాయి కాబట్టే.. ఇంత క్రేజ్ సంపాదించుకుందని రకుల్‌కు కాంప్లిమెంట్స్ పడుతున్నారు.

English summary
Rakul Preet Singh met her favourite actor Shah Rukh Khan on the sets of Bruce Lee.
Please Wait while comments are loading...