»   » ముందు రకుల్ కి తిండిపెట్టండ్రా అన్నాడట: పొట్ట కనపడకూడదని.., ధృవ పాట కోసం

ముందు రకుల్ కి తిండిపెట్టండ్రా అన్నాడట: పొట్ట కనపడకూడదని.., ధృవ పాట కోసం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ ఏడాదికి గాను మోస్ట్ సక్సెస్ ఫుల్ టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. రీసెంట్ గా రిలీజ్ అయిన ధృవ మూవీ సక్సెస్ ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నానని చెబుతోంది. ఒకే ఏడాది ఎన్టీఆర్.. అల్లు అర్జున్.. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో నటించి.. అన్నీ సక్సెస్ లు సాధించడం చిన్న విషయమేమీ కాదు. అయితే.. చెర్రీతో రకుల్ చేసిన మొదటి మూవీ బ్రూస్ లీ ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. వెంటనే రామ్ చరణ్ తో నటించాలంటూ పిలుపు రావడంతో తెగ ఆశ్చర్యపోయానని చెప్పింది రకుల్.

తమ కాంబినేషన్లో ఫ్లాప్ వచ్చినా సరే.. చరణ్ తో వెంటనే ధృవ ఆఫర్ రావడం.. ఎనిమిదో వింతలా అనిపించిందట. అయితే.. ముందొచ్చిన ఫ్లాప్ని కూడా బాగానే కవర్ చేసింది మరి.సక్సెస్ లు మన చేతుల్లో ఉండవుగా షారూక్-కాజోల్ , సల్మాన్-రాణిలు చేసిన మూవీస్ అన్నీ సక్సెస్ లే కాదు వాళ్ళకీ ఫ్లాపులున్నాయ్ కదా అంటూ చక్కగా పలుకుతోంది. అయితే ఈ సినిమా కోసం తన పొట్ట పైకి కనిపించకుండా ఏం చేసిందో చెప్పటం ఇప్పుడు ఇండస్ట్రీలో బాగానే పాపులర్ అయ్యింది... కొందరు అయ్యో పాపం అంటూంటే మరికొందరేమో అబ్బ.. చా! అంటున్నారు. ఇంతకీ రకుల్ ఏం చేసిందీ... తాను తాజాగ ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పిన విషయాలేమిటీ అంటే...


వాటర్ మెలన్ డైట్:

వాటర్ మెలన్ డైట్:

ధృవలో పరేషానురా పాట కోసం చాలా కష్టపడ్డానని చెప్పిన రకుల్.. ఈ పాట కోసం వాటర్ మెలన్ డైట్ చేసిందట. పొట్ట కొంచెం కూడా ఎత్తు పెరగకుండా ఉండేందుకు కనీసం నీళ్లు కూడా తాగేది కాదట. గొంతు తడుపుకోవడం.. ఒకటీ అరా పుచ్చకాయ ముక్కలు నమిలి దాహం తీర్చుకునేదిట రకుల్. అంతగా కష్టపడింది కాబట్టే.. ఇప్పుడు ధృవ సక్సెస్ లో క్రెడిట్ ఆమెకు కూడా దక్కుతోంది మరి. తన మాటల్లోనే మరిన్ని విషయాలు.


చరణ్‌ టేస్ట్‌ ఏంటో తెలిసింది:

చరణ్‌ టేస్ట్‌ ఏంటో తెలిసింది:

తెలుగు, తమిళంలో విడుదలైన ప్రతి చిత్రాన్నీ నేను వెంటనే చూసేస్తాను. ‘తని ఒరువన్' కూడా అలాగే చూశాను. ఈ పాత్రను అంగీకరించడంలోనే చరణ్‌ టేస్ట్‌ ఏంటో తెలిసింది. సూరి ఈ చిత్రాన్ని మరింత స్టైలిష్‌గా తెరకెక్కించారు. వారిద్దరితోనూ అంతకు ముందే నేను సినిమాలు చేసినా అవి పెద్దగా ఆడలేదు. అయినా వారు నన్ను ఈ ప్రాజెక్ట్‌ కోసం సంప్రదించినప్పుడు నాకు ఎయిత్ వండర్‌లాగా అనిపించింది.


అందరికీ తెలుసు:

అందరికీ తెలుసు:

సినిమాల సక్సెస్‌లు, ఫెయిల్యూర్‌లు కలిసి నటించే జంట చేతిలో ఉండవన్న సంగతి అందరికీ తెలుసు. అయినా ఒక సారి ఫ్లాప్‌ వస్తే వెంటనే ఇంకో సినిమాలో ఆ జోడీని పెట్టడానికి ఎందుకు ఆలోచిస్తారో అర్థం కాదు. ఒకసారి పనిచేసిన వారితో మళ్లీ చేయడం వల్ల కంఫర్ట్‌ లెవల్స్‌ పెరుగతాయి. ‘ధృవ'ను చాలా కంఫర్ట్‌గా చేశాను. ఈ చిత్రం విజయం సాధించడం వల్ల చరణ్‌కి, సూరికి నాపై ఉన్న నమ్మకం రెట్టింపయి ఉంటుంది. అందుకే నాకు ఈ చిత్రం చాలా స్పెషల్‌.


కనీసం నీళ్లు కూడా:

కనీసం నీళ్లు కూడా:

గీతా ఆర్ట్స్‌లో ‘సరైనోడు' తర్వాత నేను చేసిన చిత్రం ‘ధృవ'. వరుస చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల దీనికి డబ్బింగ్‌ చెప్పడం కుదర లేదు. ‘ధృవ'లోని ‘పరేషాను..' పాట కోసం కాస్త కష్టపడ్డాను. ఆ పాట జరుగుతున్నంత సేపు కనీసం నీళ్లు కూడా తాగేదాన్ని కాదు. దాహం వేసినా పెదాలను తడుపుకునేదాన్ని.


పొట్ట పెద్దగా కనిపిస్తుందని:

పొట్ట పెద్దగా కనిపిస్తుందని:

ఏం తిన్నా పొట్ట పెద్దగా కనిపిస్తుందని తినేదాన్ని కాదు. మరీ నీరసించిపోకుండా ఒకటో, రెండో పుచ్చకాయ ముక్కల్ని మాత్రం తీసుకునేదాన్ని. అలా నాలుగు రోజులు చేశాను. నాకు డైటింగ్‌ అంటే అసలు నచ్చదు. ఏం తింటే మంచిదో తెలుసుకుని తింటాను. అంతేగానీ డైటింగ్‌లు చేయను. షూటింగ్‌ గ్యాప్‌ల్లో కూడా ఫిట్‌నెస్‌కు సంబంధించిన పుస్తకాలు చదవడం నాకు బాగా అలవాటు.


మరి పవన్ తో జోడీ ఎప్పుడు:

మరి పవన్ తో జోడీ ఎప్పుడు:

ఇక ఇద్దరు మెగా హీరోలతో చేసారు ఇప్పుడు ఇంకో మెగా హీరోతో చేస్తున్నారు ఇక మరి పవన్ తో జోడీ ఎప్పుడు అంటే మాత్రం చాలా తెలివిగా ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను రెడీ. అంతే కాదు నాకు రొమాంటిక్‌ లవ్‌స్టోరీలంటే చాలా ఇష్టం. అందుకే మణిరత్నంగారి ‘ఓకే బంగారం' తరహా సినిమా చేయాలని ఉంది.


నా కోరికల్లో ఒకటి :

నా కోరికల్లో ఒకటి :

ఇక రాజమౌళి గారి సినిమా లో పిలుపుకూడా నాకున్న కోరికల్లో ఒకటి రాజమౌళిగారు ఎప్పుడు పిలిచినా వెళ్లి నటించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ మద్య కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య పక్కన ఓ సినిమా ఒప్పుకున్నాను. నన్ను నేను ఎలాంటి పాత్రలో చూసుకోవాలనుకుంటానో అలాంటి పాత్రను డిజైన్ చేశారు కల్యాణ్‌ కృష్ణ.


విశాల్‌ చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చింది:

విశాల్‌ చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చింది:

సాయిధరమ్‌తేజ్‌ ‘విన్నర్‌'లో అథ్లెట్‌గా నటిస్తున్నాను. వచ్చే ఏడాది తమిళంలో కార్తితో ఓ సినిమా చేస్తున్నాను. మహేశ్ - మురుగదాస్‌ చిత్రం, బెల్లంకొండ శ్రీనివాస్‌ - బోయపాటి సినిమా సెట్స్‌పై ఉన్నాయి. కాల్షీట్లు కుదరక ఇటీవలే విశాల్‌ చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అంటూ చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్


రకుల్ కి తిండిపెట్టండీ:

రకుల్ కి తిండిపెట్టండీ:

నేను తెలుగు బాగా నేర్చుకున్నా తెలుగులో నాకు ఎవరూ చెప్పకుండా నే నాకో మాట అర్థమయ్యింది. ఒక రోజు పాట కోసం షూట్ అయిపోగానే నాడైట్ చూసిన వాళ్ళలో ఒక రు "రేయ్..! షూట్ అయిపోయిందా రకుల్ కి తిండిపెట్టండీ" అని అరిచారు. కోపం కాదు గానీ నవ్వొచ్చింది అంటూ చెప్పింది.


English summary
A strict diet was followed to look beautiful in this song. I stopped drinking water in the night for four days in a row. Here is the Diet - 5 Almond, One Fruit, Two Dry Fruits and Very Little Quantity of Water" said Rakul preeth singh
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu