»   » మహేష్ మళ్ళీ రిస్క్ తీసుకుంటున్నాడా?? డిజాస్టర్ కాంబో.. మళ్లీనా?

మహేష్ మళ్ళీ రిస్క్ తీసుకుంటున్నాడా?? డిజాస్టర్ కాంబో.. మళ్లీనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ కెరీర్లో ఆగడు తర్వాత ఆ రేంజ్ డిజాస్టర్ బ్రహ్మోత్సవం దాని తర్వాత వచ్చేసినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టి మళ్ళీ తన స్టామినా పెంచుకోవాలి అని చూసిన మహేష్ కి చుక్కెదురయ్యింది స్పైడర్ తో. వ్యక్తిగతంగా ఇప్పుడు మహేష్ ఫాలోయింగ్ కి గానీ, క్రేజ్ కి గానీ స్పైదర్ ఫ్లాప్ పెద్ద మచ్చ కాకపోవచ్చుగానీ, ఖాతాలో వరుస పరాజయాలు ఉండటం కూడా మంచిది కాదు. కానీ ఎవరూ తప్పించలేరుకదా ఇలా ఫ్లాప్ పడిపోయింది. అదీ కొందరు అభిమానులకి కూడా అసతృప్తిగానే ఉన్నా పైకి చెప్పలేనంత అసహనం. అయితే ఇక్కడ మహేష్ విషయం పక్కన పెడితే గమనించాల్సిన విషయం ఒకటుంది. అదే హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్

డిజాస్టర్ తప్పిందని సంతోషించింది

డిజాస్టర్ తప్పిందని సంతోషించింది

ముందు డిజాస్టర్ "బ్రహ్మోత్సవం" లో అసలు ముందు రకుల్‌ప్రీత్ సింగ్ నే అనుకున్నారట. కానీ డేట్లు సర్దుబాటు చేయలేక ఆ సినిమా ఓకే కాలేదు. మహేష్ లాంటి స్టార్ తో చాన్స్ మిస్సయ్యిందే అని ముందు బాధ పడ్డ రకుల్ తర్వాత మాత్రం ఒక డిజాస్టర్ తప్పిందని సంతోషించింది. ఐతే పాపం రకుల్ రెండోసారి మాత్రం తప్పించుకోలేకపోయింది. మురుగదాస్ లాంటి స్టార్ దర్శకుడితో మహేష్ కాంబినేషన్లో సినిమా చేసే అవకాశం దక్కిందని సంబరపడ్డ రకుల్‌కు చేదు అనుభవమే మిగిలింది.

Mahesh Babu’s Spyder Film Buyers Are In Shock? బయ్యర్లు మునుగుతున్నారు?
‘స్పైడర్' డిజాస్టర్

‘స్పైడర్' డిజాస్టర్

‘స్పైడర్' డిజాస్టర్ అయి.. ఆమె ఉత్సాహంపై నీళ్లు చల్లింది.ఐతే ఇప్పుడు వచ్చిన న్యూస్ కాస్త ఆశాజనకంగానే ఉంది (మనకి కాదు రకుల్ కి) ‘స్పైడర్' ఫలితం గురించి పట్టించుకోకుండా రకుల్‌తో ఇంకో సినిమా చేయడానికి మహేష్ బాబు ధైర్యం చేస్తున్నట్టు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.

రకుల్ ప్రీత్‌కే ఓటేశారట

రకుల్ ప్రీత్‌కే ఓటేశారట

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను'లో నటిస్తున్న మహేష్.. దీని తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు హీరోయిన్‌కు పూజా హెగ్డేతో పాటు పలు పేర్లు పరిశీలించిన అనంతరం.. చివరికి రకుల్ ప్రీత్‌కే ఓటేశారట.

రకుల్ టాలెంట్ చూసి

రకుల్ టాలెంట్ చూసి

‘స్పైడర్' రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ అందులో రకుల్ టాలెంట్ చూసి.. తనకు మరో అవకాశం ఇవ్వడానికి మహేష్ అంగీకరించినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాతలు దిల్ రాజు-అశ్వినీదత్ ఉమ్మడిగా నిర్మించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుంది.

English summary
Rakul Preet to team up again with Mahesh Babu in his next with director Vamshi Paidipally?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu