»   »  'నాన్నకు ప్రేమతో...' ఫస్ట్ లుక్ : రకుల్ కామెంట్

'నాన్నకు ప్రేమతో...' ఫస్ట్ లుక్ : రకుల్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో...'. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను వినాయిక చవితి సందర్బంగా ఎన్టీఆర్‌ తన సోషల్ నెట్ వర్కింగ్ ఖాతా ద్వారా విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చిత్రం హీరోయిన్ రకుల్ ప్రీతి సైతం ఈ ఫస్ట్ లుక్ కు ఫిదా అయిపోయి ట్వీట్ చేసింది. అదేమిటో ఇక్కడ చూడండి. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.


అలాగే ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం లండన్ వెళ్లిన ఈ భామ తన పార్ట్ పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చేసింది.చిత్రం విశేషాలకు వస్తే....సుకుమార్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'నాన్నకు ప్రేమతో...' షూటింగ్‌ లండన్‌లో జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కథలో ఓ సర్పైజ్ ఉండబోతోందని సమాచారం.అది మరేదో కాదు ఎన్టీఆర్ ద్వి పాత్రాభినయం చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటివరకూ బయిటకు వచ్చింది ఎన్టీఆర్ ఒక పాత్ర గెటప్ అని, రెండో గెటప్ గోప్యంగా ఉంచాలని యూనిట్ నిర్ణయించుకుందని సమాచారం. గతంలోనూ ఎన్టీఆర్...అదుర్స్ చిత్రంలో డ్యూయిల్ రోల్స్ చేసారు. అది మంచి హిట్టైంది. అయితే ఈ డ్యూయిల్ రోల్ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం లేదు.


ఎన్టీఆర్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 8,2016న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ లోగా దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 22న టీజర్ ని విడుదల చేయాలని నిర్ణయించారు


nannaku prematho

అలాగే ఈ సినిమా కోసం లండన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ని 26 వ ఫ్లోర్ లో ఆఫీస్ సెట్ వేసారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న జగపతి బాబు ఆఫీసు గా ఇది కనిపించనుంది. ఇందుకోసం 60 లక్షలకు పైనే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ కు ముందు జగపతిబాబుకు, ఎన్టీఆర్ కు మధ్య వచ్చే కీలక సన్నివేశం కోసం ఈ సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఈ సెట్‌కు రూపకల్పన చేశారని సమాచారం. అక్కడ లండన్ వర్కర్స్ కొందరు ఈ సెట్ నిర్మాణంలో పాలుపంచుకున్నట్లు చెప్తున్నారు.


దర్శకుడు మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ని కొత్త తరహా పాత్రలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన తెరపై కనిపించే విధానం భిన్నంగా ఉంటుంది. ఇదివరకటితో పోలిస్తే మరింత స్త్టెలిష్‌గా కనిపిస్తారు. ఎన్టీఆర్‌ కోసం ప్రత్యేకంగా ఓ బైక్‌ని తయారు చేయించాం. అది చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది''అన్నారు.నిర్మాత మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ సినీ ప్రయాణానికీ, మా సంస్థకి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన చిత్రమిది. ఆ తర్వాత స్పెయిన్‌లో జరిగే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది'' అన్నారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ఈ చిత్రాన్ని తమిళంలో డబ్బింగ్ చేసి అదే రోజు విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరగుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా కొందరు తమిళ నటుల్ని కీలకమైన పాత్రలకు తీసుకుందామనే ఆలోచనలో దర్శక,నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.


English summary
Rakul Preet tweeted: Isn't this d most stylish look of tarak9999 #NannaKuPremathoFirstLook .. Njoy!! Nannaku Prematho, the upcoming movie in Sukumar's direction will have Jr NTR in dual roles.
Please Wait while comments are loading...