»   » ఎన్టీఆర్ తాజా చిత్రం గురించి రకుల్ ప్రీతి సింగ్

ఎన్టీఆర్ తాజా చిత్రం గురించి రకుల్ ప్రీతి సింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ లండన్‌లో మొదలైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ రకుల్ ప్రీతి సింగ్ ట్వీట్ చేసింది. ఆమె తాను చాలా ఎక్సైట్ మెంట్ తో ఉన్నానని, కొత్త టీమ్ తో పనిచేయటానికి చాలా ఉత్సాహంగా ఉందని తెలియచేసింది. ఆమె ఏమందో మీరూ చూడండి.

'నాన్నకు ప్రేమతో...' అనేది వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ గెటప్ ఎలా ఉంటుందో తెలియజేస్తూ వర్కింగ్ స్టిల్స్‌ను చిత్ర యూనిట్ విడుదల నిన్న చేసింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సుకుమార్ మాట్లాడుతూ...''సెప్టెంబర్ 20 వరకు లండన్‌లోనే తొలి షెడ్యూల్ జరుగుతుంది. తర్వాత రెండు షెడ్యూల్స్‌తో చిత్రం పూర్తవుతుంది'' అని తెలిపారు.

Rakul Preethi Singh about Ntr movie

ఎన్టీఆర్‌ హీరో గా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ నిర్మాత. సోమవారం లండన్‌లో చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్‌ కేశాలంకరణ మార్చారు. గడ్డం పెంచారు. ఆ లుక్‌.. చిత్రబృందం బయటపెట్టింది.

సెప్టెంబరు 20 వరకూ లండన్‌లోనే కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారు. హైదరాబాద్‌లోనూ ఇరవై రోజుల పాటు షూటింగ్‌ జరుపుతారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్‌కిది 25వ సినిమా కావడం విశేషం. సమర్పణ: రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కో ప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు

English summary
Rakul Preet tweeted: Touchdown London!! Reallly excited to start #ntr25 tomoro..Looking forward to Working with a new team , new people !!#learning #movies #work
Please Wait while comments are loading...