»   » సినిమా చూడండంటూ రకుల్ రికమండేషన్

సినిమా చూడండంటూ రకుల్ రికమండేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రకుల్ ప్రీతి సింగ్ ఎప్పుడు ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటూంటుంది. ఆమె తన సినిమాలే కాక ప్రక్క సినిమాలు కూడా పనిలో పనిగా ప్రమోట్ చేసి పారేస్తుంది. తాజాగా ఆమె ఈ రోజు విడుదల అవుతున్న రామ్, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా రూపొందిన శివం సినిమాకు వెళ్లాలని అభిమానులను మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కోరుతోంది.


శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో స్రవంతి రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా హీరోయిన్ రాశిఖన్నాకు రకుల్ తన ఆల్ ద బెస్ట్ చెప్పింది. పొద్దున్నే ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన రకుల్.. హీరో రామ్ కు కూడా అభినందనలు తెలిపింది. ఇక అభిమానులనైతే, గయ్స్.. వెళ్లండి, సినిమా చూడండి అంటూ చెప్తోంది.


ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా రూపొందిన చిత్రం 'శివమ్'. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో 'స్రవంతి' రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన శ్రీనివాసరెడ్డి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. 'శివమ్' అక్టోబర్ 2న అంటే ఈ రోజున విడుదల చేస్తున్నారు.


Rakul preetsingh tweet about Sivam

ఈ సందర్భంగా 'స్రవంతి' రవికిశోర్ మాట్లాడుతూ - ''హై ఓల్టేజ్ లవ్ స్టోరీతో రూపొందిన చిత్రం ఇది. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. అన్ని అంశాలూ ఉన్న కథ. రామ్ ఎనర్జీ లెవల్స్ కి తగ్గ పాత్రను చేశారు. కథాబలం ఉన్న చిత్రం ఇది. స్ర్కీన్ ప్లే కూడా బ్రహ్మాండంగా కుదిరింది. శ్రీనివాసరెడ్డికి ఇది తొలి చిత్రం అయినప్పటికీ, అద్భుతంగా తెరకెక్కించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన పాటలను ఇటీవలే విడుదల చేశాం. అన్ని పాటలకూ అద్భుతమైన స్పందన లభిస్తోంది. విజువల్ గా కూడా పాటలు ఐ ఫీస్ట్ గా ఉంటాయి. ముఖ్యంగా నార్వే, స్వీడన్ లలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన పాటలు చాలా కలర్ ఫుల్ గా ఉంటాయి.'' అని చెప్పారు.


దర్శకుడు మాట్లాడుతూ - ''ఇందులో రామ్ లుక్ ఎక్స్ ట్రార్డినరీగా ఉంటుంది. నటన సూపర్బ్. రామ్ కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి. రామ్, రాశీఖన్నా పెయిర్ చూడచక్కగా ఉంటుంది. మామూలుగా సినిమా సక్సెస్ గురించి విడుదలకు ముందు మాట్లాడని దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రం ఆడియో ఫంక్షన్లో 'ఈ సినిమా సూపర్ హిట్' అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. పాటలు మాత్రమే కాదు. ఆర్.ఆర్. కూడా ఆయన అద్భుతంగా చేశారు. టెక్నికల్ గా ఈ చిత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. రసూల్ ఫొటోగ్రఫీ హైలైట్ గా నిలుస్తుంది'' అని చెప్పారు.


బ్రహ్మానందం, అభిమన్యుసింగ్, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: రసూల్ ఎల్లోర్, యాక్షన్: పీటర్ హెయిన్స్.


English summary
Rakul Preet singh tweeted ...All d besttttttt to ramsayz and my darling RaashiKhanna for #Shivam releasing today... Guys go watch it!!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu