»   » ఎన్టీఆర్ మాటల్లో వింటేనే బాగుంటుంది: రామ్

ఎన్టీఆర్ మాటల్లో వింటేనే బాగుంటుంది: రామ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తారక్ (ఎన్టీఆర్) మాటల్లో వింటేనే బాగుంటుంది. సినిమా మొదట్లో నా పాత్రని పరిచయం చేసేది తారక్ గొంతే అంటూ మురిసిపోతూ చెప్తున్నారు రామ్. అతను హీరోగా చేసిన రామ రామ కృష్ణ కృష్ణ చిత్రం ఈ రోజు(మే 12 బుధవారం) రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్రంలో తన పాత్ర గురించి మాట్లాడుతూ...తొలిసారి విలేజ్ బ్యాక్‌డ్రాప్ చేశా. అలా అని నాటు తరహాలో నా పాత్ర ఉండదు. ఈ కాలానికి తగ్గట్లే ఉంటుంది ఆ పాత్ర. 85 రోజులు రాజమండ్రి పరిసరాల్లో పనిచెయ్యడం మంచి ఎక్స్‌పీరియెన్స్. చెప్పాలంటే నా పాత్రలో రెండు కాదు మూడు ఛాయలున్నాయి. 'మాటకి రామ, మాయకి కృష్ణ, ఈ రెండూ కుదరకపోతే రచ్చమీద రామకృష్ణ'. ఇదే పాత్ర మనస్తత్వం. దీన్ని తారక్ (ఎన్టీఆర్) మాటల్లో వింటేనే బాగుంటుంది. సినిమా మొదట్లో నా పాత్రని పరిచయం చేసేది తారక్ గొంతే అన్నారు. ఇక నటుడిగా ఈ సినిమా నాకు వెరీ బిగ్ చాలెంజ్. 'ఈ క్యారెక్టర్ నేను చెయ్యగలనా' అనే డౌట్ వస్తే, దాన్ని చాలెంజింగ్‌గా తీసుకుని చేస్తా. అలాగే ఈ సినిమా చేశా. ప్రతి ఊళ్లో ఒక రామకృష్ణ లాంటివాడు ఉంటే బాగుండు అనిపించేలా ఉండే ఆ క్యారెక్టరైజేషన్‌ని ఇష్టపడి చేశా అన్నారు.

ఈ చిత్రం దిల్ రాజు నిర్మాతగా శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో హీరో రామ్ మెళ్లో ఓ డాలర్‌ ఉంటుంది. ఆ డాలర్‌కి ఒక సైడ్‌ రాముడు, మరో సైడ్‌ కృష్ణుడు ఉంటాడు. దీనికి పెద్ద కథే ఉంటుంది. రాముడిలా మాటమీద నిలబడి అందరికీ మంచి చేయమని తండ్రి రాముడి డాలర్‌ మెళ్లో వేస్తే...కృష్ణుడిలా మాయ చేసైనా...ఎదుటివారికి మంచి చేయమని అమ్మ కృష్ణుడి లాకెట్‌ వేస్తుంది. కాలక్రమంలో ఆ రెండు లాకెట్లను ఒకటిగా మార్చుకొని మెళ్లో వేసుకుంటాడు హీరో. అలాగే అమ్మానాన్నలు చెప్పిన రెండు సూత్రాలనూ పాటిస్తుంటాడు. ముందు మాటమీద నిలబడి మంచిగా చెప్పిచూస్తాడు. కుదరకపోతే లాకెట్‌ తిప్పుతాడు..ఇక అక్కడ్నుంచి..రామకృష్ణ అల్లరి. ఈ పాత్రను రామ్‌ పోషించిన విధానం బాగా వచ్చిందని చెప్తున్నారు‌. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్ గా ప్రియా ఆనంద్‌, బిందు మాధవి చేసారు. సీనియర్‌ హీరో అర్జున్‌ అశోక్ ‌దేవగాకీ రోల్‌ చేశారు. బెస్ట్ ఆఫ్ లక్ రామ్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu