»   » రామ్,బెల్లంకొండ వివాదం అలా ముగిసింది

రామ్,బెల్లంకొండ వివాదం అలా ముగిసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్,నిర్మాత బెల్లంకొండ సురేష్ మధ్య రెమ్యునేషన్ విషయంలో వివాదం మొదలైన సంగతి తెలిసిందే.ఈ వివాదాన్ని మూవీ ఆర్టిస్ట్స్ అశోషియేషన్ వద్దకు రామ్ తీసుకెళ్ళి కంప్లైంట్ చేసారు.మొత్తానికి రకరకాలగా చర్చలు జరిపి ఈ వివాదాన్ని మొత్తానికి సెటిల్ చేసారు.రామ్ కి ఇవ్వాల్సిన కోటి రూపాయలులో కొంత కోత పెట్టి ఈ సెటిల్ మెంట్ చేసినట్లు తెలుస్తోంది.బెల్లంకొండ సురేష్ కూడా ఈ రెమ్యునేషన్ విషయమై గట్టి పట్టుపట్టునట్లు తెలుస్తోంది.ఇక రామ్ ఈ చిత్రం తర్వాత చెయ్యాల్సిన గౌతమ్ మీనన్ ప్రాజెక్టుకు మాత్రం నో చెప్పేసాడు.మొదట అనుకున్న దాని ప్రకారం ఇంత గొడవ జరిగాక వెళ్ళటం కష్టమని తేల్చేసాడు.అప్పటికీ రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ కలగచేసుకుని తాను అందులో ఫిప్టీ పర్శంట్ వాటా తీసుకుని చేస్తానన్నా రామ్ కాదన్నాడు.ఇక కందిరీగ హిట్టులో రామ్ కన్నా సోనూసూద్ కే ఇక్కువ భాగం అని చెప్తూ సోనూసూద్ హీరోగా సినిమా చేస్తానని బెల్లంకొండ సురేష్ ప్రకటించి రామ్ ని ఇంకా కాలేలా చేసాడు.దాంతో చివరకు గౌతమ్ మీనన్ ప్రాజెక్టుకు దెబ్బ పడింది.ఇప్పుడు బెల్లంకొండ అదే సబ్జెక్టుతో గౌతమ్ మీనన్ తో సినిమా చేయాలంటే వేరే హీరోని చూసుకోవాలి.అలా కాకుండా రామ్ తోనే గౌతమ్ మీనన్ చేసుకోవాలంటే నిర్మాతని వెతుక్కోవాలి.ఇప్పుడు గౌతమ్ మీనన్ కోర్టులో బంతి ఉంది.ఆయన బెల్లంకొండ వైపు తిరుగుతాడా,రామ్ వైపు మ్రొగ్తు చూపుతాడా అన్నది తేలాల్సి ఉంది.

English summary
Finally, the deadlock between actor Ram and producer Bellamkonda Suresh ended with Telugu Movies Artistes’ Association stepping in to solve the matter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu