»   » విమర్శలు రాకుండా ‘కాటమరాయుడు’పై రామ్ చరణ్ స్పందన!

విమర్శలు రాకుండా ‘కాటమరాయుడు’పై రామ్ చరణ్ స్పందన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'కాటమరాయుడు' మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ శనివారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ నుండి ఎవరూ రాక పోవడంపై మళ్లీ రకరకాల ప్రచారం మొదలైంది.

అయితే ఈ విషయంలో ఎలాంటి పుకార్లు రాకుండా రామ్ చరణ్ స్పందించారు. తన ఎఫ్.బి పేజీ ద్వారా కాటమరాయుడు ట్రైలర్ షేర్ చేసిన చరణ్.... బాబాయ్ లుక్ పవర్ ఫుల్ గా ఉందని ప్రశంసించాడు. మన అందరి కాటమరాయుడు ఈ నెల 24న థియేటర్లలోకి వస్తున్నాడు సిద్ధంగా ఉండండి అంటూ అభిమానులకు పిలుపునిచ్చాడు.

Ram Chara about Katamarayudu

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హీరోగా నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై కిషోర్ పార్థ‌సాని ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌త్‌మ‌రార్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం కాట‌మ‌రాయుడు. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోగా నటిస్తోంది.

మార్చి 24న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇప్పటికే టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ మొదలవ్వడం... క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడు పోవడం కూడా జరిగిపోయింది. తమిళ మూవీ వీరమ్ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

English summary
"Looks Like a power packed celebration, 'Mana Andari Katamarayudu' in theatres from 24th March!" Ram Charam tweeted about Katamarayudu Official Trailer.
Please Wait while comments are loading...