»   » రామ్ చరణ్ ఎగిరే విమానం నుంచి దూకేసాడా?

రామ్ చరణ్ ఎగిరే విమానం నుంచి దూకేసాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ తన తాజా చిత్రం ఆరెంజ్ లో ఎగిరే విమానం నుంచి దాదాపు 14 వేల అడుగుల ఎత్తునుంచి క్రిందకు దూకేసే సీన్ ఉంది. తన ప్రేమను నిరూపించుకోవటానకి రామ్ చరణ్ ఈ దూకుడు కార్యక్రమం నిర్వహిస్తాడట. ఈ విషయమై నిర్మాత నాగబాబు మాట్లాడుతూ..... '' ఆరెంజ్ పేరుకు తగ్గట్టు ఓ రేంజ్‌లో ఉండే ప్రేమకథ ఇది. కథ, కథనం ముఖ్యంగా చరణ్‌ స్త్టెల్‌ యువతకు నచ్చుతుంది. అతని నటన, హావభావాలు కథకి బలాన్నిచ్చాయి. యూత్ కే కాదు అన్ని వయసులవాళ్లూ ఆ పాత్రను ప్రేమిస్తారు. ఇందులో చరణ్‌ 14 వేల అడుగుల ఎత్తునుంచి దూకి స్కై డైవ్‌ చేశాడు. ఈ సాహసం ఓ హైలైట్‌. ఆ సన్నివేశాల్ని ఆస్ట్రేలియాలో చిత్రీకరించాం. హారిస్‌ జైరాజ్‌ అందించిన స్వరాలకు మంచి స్పందన వస్తోంది. అన్ని పాటలూ చాలా బాగున్నాయని అంటున్నారు. పాటల చిత్రీకరణ కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాము'' అన్నారు.

ఇక జెనీలియా హీరోయన్ గా చేస్తున్న ఈ చిత్రంలో . షాజన్‌ పదమ్‌ సీ, సంచితా షెట్టి లీడ్ కూడా రోల్స్ చేస్తున్నారు. షాజన్‌ పదమ్‌ సీ ఈ చిత్రంలో టీనేజ్‌ అమ్మాయిగా, ఫ్రెష్‌గా కనిపిస్తాను అని చెప్తోంది. సినిమా సెకెండాఫ్ ఫ్లాష్ ‌బ్యాక్‌ సన్నివేశాల్లో ఆమె పాత్ర వస్తుంది. నాగేంద్రబాబు తన అంజనా ప్రొడక్షన్స్ పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కె.వెంకట్రావు సమర్పించే ఈ చిత్రం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. అలాగే ఈ ఈచిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. మరో ప్రక్క రామ్ చరణ్ ధరణి దర్శకత్వంలో 'మెరుపు' అనే చిత్రం చేస్తున్నారు

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu