»   » హీరోయిన్‌గా నిహారిక ఎంట్రీ: రామ్ చరణ్ ఇలా అన్నాడేంటి?

హీరోయిన్‌గా నిహారిక ఎంట్రీ: రామ్ చరణ్ ఇలా అన్నాడేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుంచి నాగ‌బాబు కుమార్తె నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం రామ్ చరణ్ కు మాత్రం ఇప్పటి వరకు తెలియదట. ఆయన కూడా ఈ విషయాన్ని పేపర్లలో చదవి తెలుసుకున్నాడట. మరి ఈ విషయం నాగబాబు గానీ, నిహారిక గానీ చెర్రీకి చెవిన వేయలేదా ఏంటి? అని అంతా ఆశ్చర్య పోతున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ స్పందిస్తూ ‘నిహారిక హీరోయిన్ ఎంట్రీ ఇవ్వ‌నుంద‌నే విష‌యం గురించి నాకు తెలియ‌దు. కాక‌పోతే నేను కూడా పేప‌ర్ లో చ‌ద‌వాను. నిహారిక హీరోయిన్ గా న‌టిస్తానంటే ఏదైనా ప్రాబ్ల‌మ్ ఉంటే నాగబాబు గారికి ఉండాలి. ఆయ‌న‌కు ఏ అభ్యంత‌రం లేక‌పోతే మాకు అభ్యంత‌రం ఉండ‌దు' అని రామ్ చ‌ర‌ణ్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది‌.

మెగా ఫ్యామిలీ నుండి సినిమా రంగంలోకి వస్తున్న తొలి హీరోయిన్ నిహారిక. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురైన ఈ ముద్దుగుమ్మ త్వరలో ‘ఒక మనసు' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగ శౌర్య హీరో.

ఇప్పటి వరకు స్టార్ హీరోల వారసులు హీరోగా పరిచయం అవుతున్నారంటే... వారిని పరిచయం చేయడానికి భారీ ఈవెంట్స్ నిర్వహించడం ఆనవాయితీ. మెగా ఫ్యామిలీ హీరోల లాంచింగ్ సమయంలో కూడా ఇలాంటి ఈవెంట్స్ జరిగాయి. తాజాగా నిహారిక ను అందరికీ పరిచయం చేయడానికి మెగా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని, ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవితో పాటు ఇతర స్టార్స్ అంతా హాజరవుతారని సమాచారం.

Ram Charan about Niharika's film entry

నిహారిక తొలి సినిమాకు.....మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు' వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రానికి నిహారిక రూ. 40 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. సాధారణంగా కొత్త హీరోయిన్లకు రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలకు మించి ఇవ్వరు. కానీ నిహారిక తొలి సినిమాకే రూ. 40 లక్షలు తీసుకుంటుండటం గమనార్హం.

మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న అమ్మాయి కావడం సినిమాకు ఓపెనింగ్స్ బావుంటాయి. అందు వల్లనే ఆమెకు ఇంత ఎక్కువ మొత్తం రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. మెగా స్టార్ వారసత్వంతో మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటి వరకు దాదాపు అరడజను మంది హీరోలు పరిచయం అయ్యారు. అయితే ఆ ఫ్యామిలీ నుండి హీరోయిన్ మాత్రం ఇప్పటి వరకు సినిమా రంగంలోకి రాలేదు. నాగబాబు కూతురు నిహారిక మెగా ఫ్యామిలీలో కొత్త శకానికి నాంది పలికింది.

English summary
"I do not know about that", Ram Charan Reacted about Niharika's film entry.
Please Wait while comments are loading...