»   » అందుకేనా? ఇంటర్నేషనల్ లైసెన్స్ కోసం చరణ్-ఉపాసన!

అందుకేనా? ఇంటర్నేషనల్ లైసెన్స్ కోసం చరణ్-ఉపాసన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం సందడి చేసారు. ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ లైసెన్సు కోసం వీరిద్దరూ ఆర్టీఏ కార్యాలయానికి బుధవారం వచ్చారు. లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారు ఫొటోలు దిగడంతో పాటు డిజిటల్‌ సంతకాలు, వేలి ముద్రలను ఆర్టీఏ అధికారులు తీసుకున్నారు.

వీరికి ఏడాది పాటు కాలపరిమితి ఉండే ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ లైసెన్సును జారీ చేయనున్నామని ఆర్టీఓ డి.దశరథం తెలిపారు. రాంచరణ్‌ రాకతో ఆర్టీఏ కార్యాలయంలో సందడి నెలకొంది. ఆయనతో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. బౌన్సర్ల రక్షణలో రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇక్కడికి వచ్చి దరఖాస్తు అనంతరం వెళ్లిపోయారు.

Ram charan Applies for International Driving License

హాలిడే ట్రిప్ కోసమేనా... ఈ దరఖాస్తు?
వరుస షూటింగులతో అలసి పోయిన రామ్ చరణ్ రిలాక్స్ అవ్వడానికి లాండ్ హాలిడే ట్రిప్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని రామ్ చరణ్ ఇటీవల ఓ నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘తాను మాత్రమే కాదు... ఉపాసన కూడా హాలీడే కోరుకుంటోంది' అని వెల్లడించారు. అయితే హాలిడే లోకేషన్ గా ఏ ప్రాంతాన్ని ఎంచుకున్నారనేది మాత్రం చరణ్ వెల్లడించలేదు. అక్కడ స్వయంగా వారే కార్ డ్రైవ్ చేసుకుంటూ వివిధ ప్రాంతాలు తిరగబోతున్నారు. అందుకోసమే ఇంటర్నేషనల్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఈ హాలీవుడ్ అనంతరం రామ్ చరణ్-ఉపాసన దంపతుల నుండి శుభవార్త వినాలని మెగా కుటుంబ సభ్యులతో పాటు, మెగా అభిమానులు కూడా శుభవార్త వినాలని కోరుకుంటున్నారు. శుభవార్త అనగానే మీకు అర్థం అయ్యే ఉంటుంది. మరి రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఆలోచన ఏమిటో ఇంకా వెల్లడి కాలేదు.

రామ్ చరణ్, ఉపాసన వివాహం జరిగిన అపపుడే మూడున్నరేళ్లు గడిచి పోయింది. త్వరలో తనకో మనవన్ని ఇవ్వాలని చిరంజీవి కూడా కోరుకుంటున్నట్లు సమాచారం. మెగా అభిమానులు కూడా చాలా కాలంగా శుభవార్త వినేందుకు ఎదురు చూస్తున్నారు.

English summary
Ram charan and Upasana Applies for International Driving License.
Please Wait while comments are loading...