»   » 500 కోట్ల రాముడు రామ్ చరణా? పోస్టర్ మాత్రం కేక

500 కోట్ల రాముడు రామ్ చరణా? పోస్టర్ మాత్రం కేక

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి ఈ ఒక్క సినిమా ఇండియన్ సినీ ఇండస్ట్రీ రూపాన్నే మార్చేసింది. సినిమా మార్కెట్ లో ఒక విప్లవం వచ్చింది. ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో దర్శకనిర్మాతలు భారీ చిత్రాలకు శ్రీకారం చుడుతున్నారు. తాజాగా 500 కోట్ల బడ్జెట్‌తో రామాయణంను తెరకెక్కించడానికి నిర్మాత అల్లు అరవింద్ సిద్దం అవుతున్నారని, ఇందులో రాముడిగా రామ్ చరణ్ కనిపిస్తాడని వార్త వచ్చింది.

అల్లు అర‌వింద్

అల్లు అర‌వింద్

టాలీవుడ్‌లో మ‌రో భారీ ప్రాజెక్టుకు అతి త్వ‌ర‌లో శ్రీ‌కారం చుట్ట‌బోతోంది. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ చిత్రానికీ పెట్ట‌నంత పెట్టుబ‌డితో ఏకంగా రూ.500 కోట్ల‌తో ఓ చిత్రం రూపొంద‌నుంది. అదీ మ‌న తెలుగులో. రామాయ‌ణ గాథ‌ని వెండి తెర‌పై ఆవిష్క‌రించ‌డానికి ఓ భారీ క‌స‌ర‌త్తు మొద‌లైంది. ఈ ప్రాజెక్టులో అల్లు అర‌వింద్, మ‌ధు మంతెన‌, న‌మిత్ మ‌ల్హోత్రా భాగ‌స్వాములు కాబోతున్నారు

రాముడి పాత్రలో ఎవరు

రాముడి పాత్రలో ఎవరు

ఇందులో రాముడి పాత్రలో ఎవరు నటించబోతున్నారనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కథానాయకుడు రాముడి పాత్రలో రామ్‌చరణ్ నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మూడు భాషల్లోని అగ్ర నటులు ఈ సినిమాలో భాగం కానున్నారని, రాముడి పాత్ర కోసం రామ్‌చరణ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నదని తెలుగు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

 రామ్ చరణ్ ని రాముడిగా

రామ్ చరణ్ ని రాముడిగా

ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణుల బృందాన్ని ప్రకటించబోతున్నారు. అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని సెట్స్‌మీదుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు సినిమాకి సంబంధించి ఓ అభిమాని రామాయణం పోస్టర్ లో రామ్ చరణ్ ని రాముడిగా చిత్రించి. సోషల్‌ మీడియాలో వదిలేశాడు.

రామ్‌చరణ్‌ రాముడిగా

రామ్‌చరణ్‌ రాముడిగా

ఇందులో రామ్‌చరణ్‌, రాముడిగా కన్పిస్తున్నాడు. ఈ డిజైన్‌ సూపర్ గా వుంది. . ఏమాటకామాటే చెప్పుకోవాలి. డిజైన్‌ అదిరిపోయిందంతే. మొన్న 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' డిజైన్‌ ఏ స్థాయిలో వుందో, అంతకు మించి ఈ 'రామాయణం' స్టిల్‌ వుంది. నిజంగా పోస్టర్ చేసిన ఆ అభిమానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

మొన్నీమధ్యనే చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమాకి సంబంధించి ఓ డిజైన్‌ వెలుగు చూసిన విషయం విదితమే అయితే, ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఎలాంటి ప్రకటన లేకుండానే అప్పుడే అభిమానులు తమ ఊహలకు పని చెబుతున్నారు. ప్రస్తుతం చరణ్ , సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

English summary
everybody is coming up with their own theories on the Rs. 500 crore 'Ramayana'. But that doesn't deter the creativity of the Ram Charan fans. They came up with a superb poster depicting Ram Charan as Lord Rama.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu