»   » వయసు మళ్లిన వాళ్లమనే రామ్ చరణ్ ని...నాగార్జున

వయసు మళ్లిన వాళ్లమనే రామ్ చరణ్ ని...నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్ తేజను మా టీవీ బోర్డు సభ్యుల్లో ఒకరిగా చేర్చుకున్నట్లు 'మా' టీవీ చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ ప్రకటించారు. 'మా' టీవీ మరో రెండు చానళ్లను ప్రారంభించింది. ఇప్పటికే మా, మా మ్యూజిక్‌తో అలరిస్తున్న 'మా' సంస్థ... కొత్తగా మా జూనియర్స్, మా సినిమా అనే చానళ్లను తెలుగు ప్రేక్షకులకు అందించింది.

ఈ సందర్భంగా 'మా' టీవీ భాగస్వామి నాగార్జున మీడియాతో మాట్లాడుతూ... మేం అందరం కాస్త వయసు మళ్లిన వాళ్లమే. నేటి తరం టీవీ ప్రేక్షకులకు ఏ తరహా వినోదం కావాలన్న దానిపై మాకు మూస అభిప్రాయాలే ఉంటాయి. ఓ యంగ్ మైండ్ మా బోర్డ్ సభ్యుల్లో ఉంటే బాగుంటుందని ఎన్నాళ్లుగానో చెబుతున్నాను. అది ఈనాటికి కుదిరింది అన్నారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu