రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం వసూళ్ల మోత మోగిస్తోంది. మరి కొన్ని వారాలపాటు బాక్స్ ఆఫిస్ వద్ద రంగస్థలం చిత్రానికి తిరుగులేదని అర్థం అయిపోయింది. రంగస్థలం మానియా అంతలా ఉందిప్పుడు. సుకుమార్ మ్యాజిక్, రాంచరణ్ పెర్ఫామెన్స్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఆంధ్ర, తెలంగాణా, ఓవర్సీస్ ఇలా ఏరియా తేడా లేకుండా అన్ని ఏరియాలలో రంగస్థలం చిత్రం హవా కొనసాగుతోంది.
చెన్నైలో కూడా రంగస్థలం చిత్రం వసూళ్లు కళ్లు చెదిరే గణాంకాలు నమోదవుతున్నాయి. రంగస్థలం చిత్రం చెన్నైలో 25 లక్షల గ్రాస్ వసూలు చేయడం విశేషం. బాహుబలి చిత్రం గతంలో ఈ స్థాయిలో తలిరోజు వసూళ్లు రాబట్టింది. బాహుబలి తరువాత స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి రికార్డుని లక్ష మార్జిన్ తో రంగస్థలం చిత్రం విశేషం.
బాబాయ్ రికార్డుని అబ్బాయి అధికమించాడని మెగా అభిమానులు సంబరపడుతున్నారు. రంగస్థలం విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ పీకే క్రియేటివ్ వర్క్స్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి | Subscribe to Telugu Filmibeat.