»   » మల్టీ టాలెంట్ కోసం రామ్ చరణ్ ఆరాటం

మల్టీ టాలెంట్ కోసం రామ్ చరణ్ ఆరాటం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కేవలం నటనకే పరమితం కాకుండా వివిధ రంగాల్లో తన సత్తా చాటాలనే కసిలో ఉన్నాడు. ఓ వైపు తెలుగులో స్టార్ హీరోగా రాణిస్తున్న రామ్ చరణ్ ఇటీవలే ఎయిర్ లైన్స్ బిజినెస్ లోకి ఎంటరైన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కర్నాటక సంగీతంలో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు. మంచి డాన్సర్, జాకీ కూడా....

ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి కదా...చాల్లే అనుకోవడం లేదు మెగాపవర్ స్టార్. వివిధ బాషలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆల్రెడీ ఫ్రెంచి బాష నేర్చుకోవడం ప్రారంభించాడు. ఇటీవల ఓ టాక్ షోలో రామ్ చరణ్ ఈ విషయాన్ని వెల్లడించారు. గోవిందుడు అందరి వాడేలే సినిమా తర్వాత మరో సినిమాకు దాదాపు ఆరు నెలల గ్యాప్ రావడంతో రామ్ చరణ్ సమయం వృధా చేయకుండా ఫ్రెంచి భాష నేర్చుకునే పనిలో పడ్డాడు.

Ram Charan Busy Learning French

సాధారణంగా హీరోలు ఏ చిన్న గ్యాప్ దొరికినా...తమ బాడీని బిల్డ్ చేయడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. అయితే రామ్ చరణ్ మాత్రం అందుకు భిన్నమైన దారిలో వెలుతున్నారు. చరణ్ తెలుగుతో పాటు తమిళం, ఇంగ్లీష్ కూడా చాలా ఫ్లూయెంటుగా మాట్లాడగలడు.

మరో వైపు సింగింగ్ లోనూ తన టాలెంట్ నిరూపించుకునేందుకు రామ్ చరణ్ ఆసక్తి చూపుతున్నారు. అవకాశం వస్తే తన సినిమాల్లో పూర్తి స్థాయి పాట పాడాలనే ప్లాన్లో ఉన్నాడు. మరి భవిష్యత్తులో ఏ సంగీత దర్శకుడు రామ్ చరణ్ తో పాట పాడిస్తాడో చూడాలి. 

English summary
Mega Power Star Ram Charan is known for his multi-tasking. Besides being a star, he is a successful businessman too. In addition to that, he is a trained Carnatic singer, a good dancer and an amazing jockey. However, Ram Charan do not like to put an end to his talent list. He is now keen on learning different languages and has already started it with French.
Please Wait while comments are loading...