»   » అమెరికాలో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుక

అమెరికాలో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుక

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ రోజు రామ్ చరణ్ తన పుట్టిన రోజుని అమెరికాలో జరుపుకోనున్నారు. త్వరలో ప్రారంభం కానున్న కొత్త చిత్రం కోసం చరణ్ అమెరికాలో డేవిడ్ బార్టన్స్ జిమ్‌లో కఠోరమైన వ్యాయామాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక తన పుట్టిన రోజు వేడుకను నిరాడంబరంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. చరణ్ తాజా చిత్రం 'ఆరెంజ్‌' ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకోవటంతో నాలుగో సినిమాపై తన దృష్టి సారించారు. మాస్‌ని మెప్పించడమే ధ్యేయంగా కథలు ఎంచుకొంటున్నారు. 'ఏమైంది ఈ వేళ' సినిమాతో బాక్సాఫీసు దగ్గర విజయం అందుకొన్న దర్శకుడు సంపత్‌ నంది. ఈ యువ దర్శకుడితో చరణ్‌ ఓ సినిమా చేయబోతున్నారు. మరోవైపు వి.వి.వినాయక్‌ కూడా చరణ్‌ కోసం ఓ కథ సిద్ధం చేశారు. ఈ రెండు సినిమాల్లో ఏది ముందుగా ప్రారంభం కానుందో అని అబిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాలు తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభం కానుంది. పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ కి ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

English summary
Hero Ram Charan Teja is celebrating his birthday today. Ram Charan who made his entry as Mega Star, Chiranjeevi’s son in Telugu film industry in 2007 has proved his mettle with his very first film ‘Chiruta’.We wish Ram Charan a very Happy Birthday and lot more successful films ahead.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu