»   » నన్నెలా తప్పు పడతారు? బ్లేమ్‌ చేస్తారు? : రామ్ చరణ్

నన్నెలా తప్పు పడతారు? బ్లేమ్‌ చేస్తారు? : రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: "ట్రూజెట్‌ ఎయిర్‌లైన్స్‌కు నేను కేవలం బ్రాండ్‌ అంబాసిడర్‌ను మాత్రమే. మహేష్ కానీ, బన్నీ కానీ బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఎలా పనిచేస్తున్నారో, దీనికి నేనూ అంతే. ఆ కంపెనీలో సమస్య వస్తే మమ్మల్నెలా బ్లేమ్‌ చేస్తారు? మ్యాగీ నూడుల్స్‌ గురించి అమితాబ్‌ బచ్చన్‌పై కేసు పెట్టడమేంటి? ఇప్పటివరకూ ట్రూజెట్‌లో నేనెక్కడికీ వెళ్లలేదు. నేనైతే వాళ్లకు ఆ సమస్య రాకుండా చూసుకొమ్మని చెప్పాను." అంటూ వివరణ ఇచ్చారు రామ్ చరణ్.

అలాగే అక్కర్లేని విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టకూడదని నిర్ణయించుకున్నాను. అనవసరంగా మా ఎనర్జీ అంతా అటేపు వెళ్తోంది. ఆ ఎనర్జీని నా పనిపై పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటాననిపించింది. అందుకేనేమో ఓపిక ఎక్కువయ్యిందనుకుంటా అంటూ చెప్పుకొచ్చారు.


Ram Charan Clarify about TruJet

రామ్‌చరణ్‌ టైటిల్‌ రోల్‌ చేసిన సినిమా ‘బ్రూస్‌లీ.. ద ఫైటర్‌'. శ్రీను వైట్ల దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా తమ కార్యాలయంలో మీడియాతో సంభాషించారు రామ్‌చరణ్‌.


డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డి.వి.వి దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. థమన్‌ సంగీతం అందించారు. దసరా సందర్భంగా ఈ నెల 16న 'బ్రూస్‌లీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర టీం ఫైనల్ రన్ టైం ని లాక్ చేసింది. ధూమపానం యాడ్స్ తో కలుపుకొని ఈ సినిమా నిడివి 146 నిమిషాలు. ఇందులో సుమారు 5 నిమిషాలు చిరంజీవి కనిపించి ఆడియన్స్ ని థ్రిల్ చేయనున్నాడు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


చిరంజీవి గెస్ట్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ ...56.45 కోట్ల వరకూ జరగటంతో ట్రేడ్ లో ఇదే చర్చనీయాంశంగా మారింది. నిర్మాతకు టేబుల్ ఫ్రాఫిట్స్ తెచ్చిపెడుతున్న ఈ చిత్రం.


"వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మొదలుపెట్టాక, పూర్తయ్యేవరకూ రిక్వెస్ట్‌లు వినపడవ్! రియాక్షన్‌లు కనపడవ్! ఓన్లీ రీసౌండ్!" అంటూ చరణ్ చెప్తూ విడుదల చేసిన ఆయన తాజా చిత్రం డైలాగ్ టీజర్ కు అభిమానులకు పండగే చేసుకున్నారు.


Ram Charan Clarify about TruJet

చిరంజీవి పాత్ర గురించి శ్రీను వైట్ల మాట్లాడుతూ... దాదాపు ఐదు నిమిషాల పాటు కనిపిస్తారు. ఆయన తెరపై కనిపించే విధానం ఒక పండగలా ఉంటుంది. అప్పటిదాకా చూసిన సినిమా ఒకెత్తు, ఆ ఐదు నిమిషాలు మరో ఎత్తు అన్నట్టుగా చిరంజీవి సందడి చేస్తారు. కథ రాసుకొన్నప్పుడే మేం చిరంజీవిగారితోనే ఆ పాత్ర చేయించాలనుకొన్నాం. సినిమాలో హీరో,హీరోయిన్స్ ని కాపాడే ఓ సన్నివేశం ఉంది. అందులోనే చిరంజీవి కనిపిస్తారు. మొదట ఓ పాటలోనూ చూపించాలనుకున్నా కుదర్లేదు అన్నాపు,


'రామ్‌చరణ్‌ లాంటి పెద్ద హీరోతో తొలిసారి నటించా. ఈ సినిమాలో చాలా గ్లామర్‌గా కనబడ్డానని అందరూ అంటున్నారు. నా లుక్‌ కోసం దర్శకుడు శ్రీనువైట్ల చాలా కష్టపడ్డారు. చరణ్‌తో డ్యాన్స్‌ చేయడం చాలా కష్టం. సాంగ్‌ షూటింగ్‌కు రెండు రోజుల ముందు నుంచే సాధన చేసేదాన్ని. ఈ విషయంలో చెర్రీ అన్ని విధాలా సహకరించేవాడు' అని రకుల్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు.


తన తాజా చిత్రం 'బ్రూస్‌లీ'లో మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి తెరను పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆ చిత్ర హీరోయిన్ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు. నగరంలోని సినీమ్యాక్స్‌ బ్లూఫాక్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా త్వరలో విడుదల కానున్న బ్రూస్‌లీ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.


నిర్మాత మాట్లాడుతూ ''బ్రూస్‌లీకి వీరాభిమాని అయిన ఓ యువకుడి కథ ఇది. తనకు ఎదురైన ఓ సమస్యపై ఎలా పోరాటం చేశాడన్నది తెరపైనే చూడాలి. వినోదం, కుటుంబ అనుబంధాలకు పెద్దపీట వేస్తూ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. రామ్‌చరణ్‌ చేసే యాక్షన్‌, డ్యాన్సులు అభిమానుల్ని అలరించేలా ఉంటాయి. ఇటీవల విడుదలైన 'లే చలో...' పాటకి మంచి స్పందన లభిస్తోంది. చిత్రాన్ని 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అన్నారు.


ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్క్రీప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
Ram Charan said he is not responsibility for Trujet complaints. Trujet topped the list of airlines with the most customer complaints and second worst in the flight cancellations in August. On Thursday night too, Trujet flight 2T 106 on the Aurangabad-Hyderabad - Tirupati route was cancelled after it reached Hyderabad, leading to irate flyers protesting on the parking bay at GMR airport.
Please Wait while comments are loading...