Just In
Don't Miss!
- Sports
ప్రపంచం ఏమైనా పిచ్చిదా?.. స్పిన్ని సమర్థంగా ఎదుర్కొనే అతడిని ఎందుకు తీసుకోలేదు: మైకేల్ వాన్ ఫైర్
- News
Red Fort ముట్టడి: ఎర్రకోటపై ఎగిరిన జెండా: అయిదంచెల భద్రత తుత్తునీయలు
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నిన్న జూ ఎన్టీఆర్, నేడు రామ్ చరణ్ మీడియా పై గరం గరం...!?
జూ ఎన్టీఆర్ వివాహమాడబోయే లక్ష్మీప్రణతి జాతకం బాగుండకపోవడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని ఛానల్స్ లో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఆ ఛానల్ కి సంబంధించిన వారిని జూ ఎన్టీఆర్ పిలిపించి వారి మీద సీరియస్ అయ్యాడన్న విషయం కూడా తెలిసిందే.
కాగా చరణ్ కూడా మీడియాకి క్లాస్ పీకాడని సమాచారం. నిజానిజాలు తెలుసుకోకుండా సంచలనాలకోసం తప్పుడు వార్తల్ని ప్రచారం చేయడం దురదృష్టకరమని ఇటీవలే ఓ కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేశాడు. సంచలనాలకోసం కాకుండా, ప్రజలకు మేలు చేసే వార్తల్ని ప్రసారం చేయాలనీ, తద్వారా వీక్షకుల మెప్పు పొందాలని చరణ్ అభిలషించాడు. లోకల్ టీవీ మీడియాలో వివిధ విభాగాలకు అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చరణ్, మీడియాపై డైరెక్ట్ గా విమర్శనాస్త్రాలు వదిలాడు.
చరణ్ ఇంతగా మీడియాపై ఆవేదన వ్యక్తం చేయడం వెనుక, గతంలో తనకూ, 'చిరుత" సినిమా హీరోయిన్ కీ పెళ్ళయిపోయిదంటూ అప్పట్లో గాసిప్స్ రావడం ఓ కారణమైతే, ఇటీవలే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై జీవిత, రాజశేఖర్ చేస్తోన్న ఆరోపణలు, వాటికి మీడియా ఇస్తోన్న ప్రాధాన్యత కూడా మరో కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరేం చెబితే దాన్ని ప్రసారం చేయడం కాకుండా, వాస్తవాల్ని తెలుసుకుని, ఆ వార్తల్ని ప్రసారం చేస్తే మీడియ అంటే ప్రజలకు గౌరవం పెరుగుతుందని చరణ్ వ్యాఖ్యానించడం, దానికి అదే కార్యక్రమంలో హాజరైన మీడియా ప్రతినిథులు అభినందనలు తెలియజేయడం గమనార్హం.