»   » షాకింగ్: రామ్ చరణ్‌కి జీవితంలో ఇదే తొలిసారి (వీడియో)

షాకింగ్: రామ్ చరణ్‌కి జీవితంలో ఇదే తొలిసారి (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ తాజాగా తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసిన ఓ విషయం చూసి అభిమానులు అంతా షాకవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని, చార్మినార్ కట్టడాన్ని ఇష్టపడే వారు. మన హైదరాబాద్ నగరం దేనికి ఫేమస్ అంటే ఎవరైనా ముందు చెప్పేది చార్మినార్, తర్వాత బిర్యానీ పేర్లే.

మన నగరానికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడానికి కారణం కూడా ఈ చారిత్రక కట్టడమే. దేశ విదేశాల నుండి ఈ చారిత్రక కట్టడాన్ని చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు. అలాంటిది చిన్నతనం నుండి హైదరాబాద్ లోనే పెరిగిన రామ్ చరణ్ ఇప్పటి వరకు చార్మినార్ ను సందర్శించలేదు.

తాజాగా తన మూవీ షూటింగులో ఓల్డ్ సిటీలో జరుగడంతో రామ్ చరణ్ తొలిసారి చార్మినార్ కట్టడాన్ని సందర్శిచారు. జీవితంలో తొలిసారి చార్మినార్ ఎక్కుతున్నానంటూ ఓ వీడియో పోస్టు చేసాడు. ఇక్కడి నుండి నగరం వ్యూ ఎంతో బావుందంటూ తన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

అయితే కొందరు ఫ్యాన్స్ ఈ విషయమై కామెంట్స్ చేస్తూ....నువ్వు చిన్నతనం నుండి హైదరాబాద్ లో పెరిగి చార్మినార్ చూడలేదా? విచిత్రంగా ఉంది అంటూ విమర్శించగా.... చరణ్ చిన్నతనం చెన్నైలో గడిచింది...రామ్ చరణ్ సెలబ్రిటీలు చార్మినార్ లాంటి రద్దీ ప్రదేశాలను సందర్శించడం చాలా కష్టం అంటూ మరికొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.

అఫ్ కోర్స్ రామ్ చరణ్ ఇన్నాళ్లు చార్మినార్ సందర్శించక పోవడానికి కారణం... తనకు ఉన్న సెలబ్రిటీ స్టేటసే. చిన్నతనంలో తండ్రితో విదేశాల్లో చాలా ప్రాంతాలు తిరిగిన రామ్ చరణ్ కు... ఇలాంటి లోకల్ సరదాలు తీర్చుకునే అవకాశం లేకుండా పోయింది.

రామ్ చరణ్ సినిమా షూటింగుకు సంబంధించిన వివరాలు, చెర్రీ పోస్టు చేసిన వీడియో స్లైడ్ షోలో....

చార్మినార్ వద్ద రామ్ చరణ్

చార్మినార్ వద్ద రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ర‌కుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్ గా, నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 హైదరాబాద్

హైదరాబాద్

కాశ్మిర్ షెడ్యూల్ పూర్తిచేసుకుని జులై నెలాఖ‌రువ‌ర‌కూ హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంది.

ప్రస్తుతం

ప్రస్తుతం

అగ‌ష్టులో సాంగ్స్ చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ న్యూ లుక్ లో కనిపించబోతున్నారు. క్యారెక్టర్ పరంగా చరణ్ స్టన్నింగ్ లుక్ తో అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరించనున్నాడు.

హైలెట్స్

హైలెట్స్

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఫెర్‌ఫార్మెన్స్‌, ర‌కూల్‌ ప్రీత్ సింగ్ అందచందాలు చిత్రానికి హైలెట్ గా నిలిస్తే, అరవింద్ స్వామి పెర్ ఫార్మెన్స్ ఈ చిత్రానికి మ‌రో హైలైట్ గా నిలుస్తాయి.

వీడియో

రామ్ చరణ్ చార్మినార్ ఎక్కుతున్న వీడియో...

English summary
"Shoot at old city hyd & climbed the Charminar for the first time ...Amazing view !!! ‪#‎hyderabad‬ ‪#‎dhruva" Ram Charan said.‬
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu