»   » బాబాయ్ తో వచ్చే ఏడాదే., నాన్న కి ఇంకా పేరు పెట్టలేదు.: రామ్ చరణ్ ఇంకా ఏం చెప్పాడు

బాబాయ్ తో వచ్చే ఏడాదే., నాన్న కి ఇంకా పేరు పెట్టలేదు.: రామ్ చరణ్ ఇంకా ఏం చెప్పాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఫేస్ బుక్‌లో అభిమానుల‌తో చిట్ చాట్ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ చాలా విషయాలే పంచుకున్నాడు. పదిహేను నిమిషాల్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పాడు మెగా హీరో. సుకుమార్ తో చేసే ప్రాజెక్ట్ విశయం మీద ఉన్న అనుమానాలను క్లియర్ చేస్తూ..సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తాను సినిమా చేయ‌బోతున్న మాట వాస్త‌వ‌మ‌ని.. ఈ సినిమా అక్టోబ‌రులో మొద‌ల‌వుతుంద‌ని.. స్క్రిప్టు పూర్తి కావ‌చ్చింద‌ని, మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంద‌ని వెల్ల‌డించాడు.ఆ సినిమా ఓ థ్రిల్ల‌ర్ అని కూడా చ‌ర‌ణ్ చెప్పాడు.

ఇక త‌న లేటెస్ట్ మూవీ ధ్రువ గురించి చెబుతూ.. ఆగ‌స్టు 15న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ‌వుతుంద‌ని చెప్పాడు. అక్టోబ‌రు 7న రిలీజ్ క‌న్ఫ‌మ్ అని కూడా వెల్ల‌డించాడు.దృవ విసయం లో ఎన్నో హోప్స్ తో ఉన్న విశయాన్ని కూడా ఇండైరెక్ట్ గా బయట పెట్టాడు.

Ram Charan Comments On hi Project with Pawan kalyan

త‌న నిర్మాణంలో తెర‌కెక్కుతున్న త‌న తండ్రి చిరంజీవి 150వ సినిమా విశేషాల్ని కూడా చ‌ర‌ణ్ అభిమానుల‌తో పంచుకున్నాడు. ఈ చిత్రానికి క‌త్తిలాంటోడు అనేది వ‌ర్కింగ్ టైటిల్ మాత్ర‌మే అని.. అస‌లు టైటిల్ ఏంటో ఇంకా నిర్ణ‌యించ‌లేద‌ని చెప్పాడు. కొంద‌రు మెగా అభిమానుల్ని సెల‌క్ట్ చేసి చిరంజీవిని షూటింగ్ స్పాట్లో క‌లిసి ఏర్పాట్లు చేయ‌బోతున్న‌ట్లు చ‌ర‌ణ్ వెల్ల‌డించాడు.

దీనిపై అటు పవన్ ఇటు చరణ్ ఇది వరకే ప్రకటనలు చేశారు. అయితే ఇంతవరకూ ఈ సినిమా సెట్ కాలేదు. తాజాగా ఈ సినిమా పై స్పదించాడు రామ్ చరణ్. పవన్ తో సినిమాపై స్పందిస్తూ.. ఈ సినిమా ఖచ్చితంగా వుంటుంది. మంచి కథ కోసం వెయిటింగ్. కథ కుదిరిన వెంటనే మా సినిమా సెట్స్ పైకి వెళుతుతుందని చెప్పాడు. త‌న బాబాయి ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్మాణంలో తాను హీరోగా న‌టించే సినిమా వ‌చ్చే ఏడాది మొద‌ల‌వుతుంద‌ని చెప్పాడు. ఇటీవ‌లే బాహుబ‌లి షూటింగ్ స్పాట్‌కు వెళ్లి త‌న మిత్రుడైన ప్ర‌భాస్‌ను క‌లిసి వ‌చ్చిన‌ట్లు చ‌ర‌ణ్ వెల్ల‌డించాడు.

English summary
Ram Charan said that he will be definitely working with his Babai. This might happen next year once both of them fulfill their existing commitments. Also he said that both of them teaming together will depend on his Babai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu