»   » డబ్బింగ్ పూర్తి చేసిన రామ్ చరణ్

డబ్బింగ్ పూర్తి చేసిన రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమా తెలుగులో ‘ప్రేమ లీల' పేరుతో విడుదల కానున్న విషయం తెలిసిందే. దీపావళి కానుకగా భారీ ఎత్తున విడుదల అవుతున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్ కు గానూ రామ్ చరణ్ డబ్బింగ్ చెప్తున్నారు.

రీసెంట్ గా తెలుగు వర్షన్‌ డబ్బింగ్‌ను మొదలుపెట్టిన చరణ్, నిన్నటితో మొత్తం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సూరజ్ భర్జత్యా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ప్రతిష్టాత్మక రాజశ్రీ ప్రొడక్షన్స్ నిర్మించింది. సల్మాన్ ఖాన్ సరసన సోనమ్ కపూర్ హీరోయిన్‌గా నటించారు.

సుప్రసిద్ధ బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్స్‌ సల్మాన్‌ఖాన్‌తో రూపొందించిన ‘మైనే ప్యార్‌ కియా' చిత్రం ‘ప్రేమపావురాలు' పేరుతో.. ‘హమ్‌ ఆప్‌కే హై కౌన్‌' ‘ప్రేమాలయం' పేరుతో తెలుగులో విడుదలై ఇక్కడ కూడా అసాధారణ విజయాలు సొంతం చేసుకోవడం తెలిసిందే.

Ram Charan completes Salman's Dub work

సల్మాన్‌ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన రామ్‌చరణ్‌.. ‘ప్రేమలీల' చిత్రంలో సల్మాన్ ఖాన్ పాత్రకు డబ్బింగ్‌ చెప్పడంతో ఈ చిత్రానికి గల క్రేజ్‌ మరింత పెరుగుతోంది. సూరజ్‌ బరజాత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్‌ సరసన సోనమ్‌ కపూర్‌ నటిస్తోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను విజయ దశమి కానుకగా విడుదల చేసారు.

తమ సంస్థ నుంచి వచ్చిన ‘ప్రేమ పావురాలు, ప్రేమాలయం' చిత్రాల కోవలో ‘ప్రేమ లీల' కూడా తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూలూ గిస్తుందని సూరజ్ బరజాత్య అంటున్నారు. ఇటీవలే ఈ చిత్రం డబ్బింగ్‌ను రామ్‌చరణ్‌ పూర్తి చేసారు. నవంబర్‌ 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుద కానుంది.

Ram Charan completes Salman's Dub work

మరో ప్రక్కన ఈ చిత్రం కథ కాపీ అంటూ ప్రచారం మొదలైంది. ది ప్రిజనర్ జెండా అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే మరో ప్రక్క అదేం కాదు...ఈ సినిమాకు మూలం గతంలో రాజశ్రీ బ్యానర్ లో వచ్చి విజయవంతమైన రాజా అవుర్ రంక్ అనే చిత్రం అనే రూమర్ బయిలుదేరింది. కవల పిల్లలు కథతో, ఒకరి స్దానంలోకి మరొకరు వచ్చే ఈ కథ లో సల్మాన్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని అంటున్నారు. అయితే ఇవన్నీ వదిలిన ఒక్క ట్రైలర్ చూసి పుట్టిన రూమర్స్ కావటం విశేషం.

నీల్ నితీన్ దేశ్ముఖ్, అనుపమ్ ఖేర్, స్వర భాస్కర్, సంజయ్ మిశ్రా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హిమేష్ రేష్మియా, నేపధ్య సంగీతం: సంజయ్ చౌదరి, చాయాగ్రహణం: వి.మణికందన్, కూర్పు: సంజయ్ సంక్ల, పంపిణీ: ఫాక్స్ స్టార్ స్టూడియోస్, నిర్మాణం: రాజశ్రీ ప్రొడక్షన్స్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సూరజ్ బరజాత్య!

English summary
Ram Charan today wrapped up the dubbing work for the movie Prema Leela, the Telugu version of Salman Khan starrer Prem Ratan Dhan Payo that is set for release next month.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu