»   » నీ ఆత్మకి శాంతి కలగాలి నా చిన్నారి తమ్ముడూ...! చిన్నారి అభిమాని మృతికి చరణ్ సంతాపం

నీ ఆత్మకి శాంతి కలగాలి నా చిన్నారి తమ్ముడూ...! చిన్నారి అభిమాని మృతికి చరణ్ సంతాపం

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొన్నాళ్ళ కిందట రామ్ చరణ్ వీరాభి మాని అయిన ఒక పిల్ల వాడు చరణ్ హిట్ సినిమా మగధీర లో డైలాగ్ లని చెబుతూ వార్తలకెక్కాడు గుర్తుందా? ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా ఇటీవల పలు సామాజిక వెబ్ సైట్ లలో హాల్ చల్ చేసింది. ఆ పిల్లవాడి మాతలకు, అభినయానికీ ముగ్దుడైన రామ్ చరణ్ ఆ పిల్లవాన్ని వెతికి మరీ ఇంటికి రప్పించుకున్నాడు. వాడి ముద్దు మాటలకూ, టాలెంత్ కూ ఆశ్చర్య పోయి అతన్ని తానే చదివిస్తాననీ, తర్వాత అతను కోరినట్టే హీరో ని చేస్తాననీ మాటిచ్చాడు, వాళ్ళ ఊరిలోనే ఒక ప్రైవేటు స్కూల్ లో చేర్పించాడు కూడా...

 Ram charan condolence to his littele fan's death

అయితే విధి మాత్రం ఆ చిన్నారి మీద కనికరం చూపలేదు తన పని తాను చేసుకు పోయింది. తనతో ఆ చిన్నారినీ తీసుకు పోయింది. అనారోగ్యం తో సరైన సమయానికి వైధ్యం అందక కన్ను మూసాడు ఆపిల్లవాడు. సామాజిక మాధ్యమాల్లో ఆ కుర్రవాడి మృ తదేహం చూసిన వారందరినీ కలచి వేసింది. ఇక ఆ పసివాన్ని దగ్గరగా చూసిన చెర్రీకి ఇంకేలా అనిపిస్తుందీ..?? అతని మరణ వార్త వినగానే బాధ పడ్డాడట చరణ్ " గుండె పగిలే వార్త, నీ ఆత్మకి శాంతి కలగాలి నా చిన్నారి తమ్ముడా" అంటూ ట్విటర్ లో తాను ఆ పసివాన్ని కలిసినప్పటి ఫొటో, అతని మృతదేహం ఉన్న ఫొటో కలిపి పోస్ట్ చేసి తన సంతాపాన్ని తెలియ జేసాడు...

English summary
"Heart breaking news, RIP little Brother" Ram charan posted in facebook on hes little fan's death
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu