twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిస్టరీ క్రియేట్ చేసిందంటూ రామ్ చరణ్

    By Srikanya
    |

    హైదరాబాద్‌: హైదరాబాదీ టెన్నిస్‌ తార సానియామీర్జా మహిళల డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌ 1 ర్యాంక్‌ సాధించింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఆమెకు ఫేస్ బుక్ ముఖంగా అభినందనలు తెలియచేసారు. ఆయన రాస్తూ...హిస్టరీ క్రియేట్ చేసిందుకు కంగ్రాట్స్..మొదటి ఇండియన్...ఫిమేల్ టెన్నిస్ డబుల్స్ లో గెలిచినందుకు..రికార్డు సృష్టించినందుకు అని తెలియచేసారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఇక సానియా మాట్లాడుతూ... 'నా చిరకాల కోరిక నెరవేరింది. నన్ను ఆశీర్వదించిన భగవంతునికి, అందరికీ ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచిన తల్లిదండ్రులు, కోచ్‌కు కృతజ్ఞతలు' అని తెలిపారు. దేశంలోని యువత తమపై తాము నమ్మకంతో ముందుకెళ్లాలన్నారు.

    అద్భుతాలు సాధించడంఅలవాటుగా మార్చుకున్న హైదరాబాదీ తార సానియా మీర్జా భారత టెన్నిస్‌ చరిత్రలో మరో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. మహిళల డబుల్స్‌లో ప్రపంచ నెంబర్‌వన్‌గా అవతరించింది. ఆదివారం స్విట్జర్లాండ్‌ దిగ్గజం మార్టినా హింగిస్‌తో కలిసి డబ్ల్యూటీఏ ఫ్యామిలీ సర్కిల్‌ కప్‌లో విజేతగా నిలిచిన సానియా.. నెంబర్‌వన్‌ కిరీటాన్ని కూడా సొంతం చేసుకుంది. దిగ్గజ ఆటగాళ్లు లియాండర్‌ పేస్‌, మహేశ్‌ భూపతి మినహా భారత టెన్నిస్‌లో మరెవరికీ సాధ్యం కాని ఘనత ఇది.

     Ram Charan Congrats Sania

    ఆదివారం ఫ్యామిలీ సర్కిల్‌ కప్‌ డబ్ల్యూటీఏ టోర్నీ టైటిల్‌తో పాటు నెంబర్‌వన్‌ ర్యాంకునూ కైవసం చేసుకుంది. టోర్నీ డబుల్స్‌లో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగిన సానియా, హింగిస్‌ జోడీ ఏకపక్షంగా సాగిన ఫైనల్లో 6-0, 6-4తో కెసే డెలాక్వా (ఇటలీ)-డారిజా జురాక్‌ (క్రొయేషియా) జంటపై ఘనవిజయం సాధించింది. టైటిల్‌తో పాటు సానియా, హింగిస్‌లకు రూ.4.5 కోట్ల ప్రైజ్‌మనీ దక్కడం విశేషం.

    ఈ టోర్నీకి ముందు డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో 7495 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న సానియా.. నెంబర్‌వన్‌ కావడానికి 145 పాయింట్ల దూరంలో నిలిచింది. టైటిల్‌ గెలవడంతో ఆమె ఖాతాలో 170 పాయింట్లు చేరాయి. దీంతో ఇటలీ స్టార్లు సారా ఎరాని (7640), రాబెర్టా విన్సి (7640)లను వెనక్కి నెట్టి 7965 పాయింట్లతో సానియా అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

    90ల చివర్లో ప్రపంచ టెన్నిస్‌లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన లియాండర్‌ పేస్‌, మహేశ్‌ భూపతి పురుషుల డబుల్స్‌లో అగ్రస్థానాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ప్రపంచ నెంబర్‌వన్‌ అయింది సానియానే. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణి ఆమే.

    Read more about: sania ramcharan
    English summary
    Ram Charan write : "Congrats Sania for creating history. The first Indian female tennis world champ in doubles alongside Martina Hingis"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X