twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్లీన్ స్వీప్ చేశారు.. కేసీఆర్, కేటీఆర్‌పై రాంచరణ్ ప్రశంసలు.. 'మా అసోసియేషన్' ఆశలన్నీ!

    |

    Recommended Video

    Ram Charan Congratulates KCR and KTR For Their Victory | Filmibeat Telugu

    తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాలు తలక్రిందులు చేస్తూ టిఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీ సాధించింది. దీనితో టాలీవుడ్ ప్రముఖుల నుంచి కేసీఆర్, కేటీఆర్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ బడా హీరోలు సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా, ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వర రావు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై టాలీవుడ్ తరుపున స్పందించారు.

    క్లీన్ స్వీప్ చేశారు

    క్లీన్ స్వీప్ చేశారు

    మెగా పవర్ స్టార్ రాంచరణ్ తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ పెట్టారు. తెలంగాణ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసినందుకు కేసీఆర్ గారికి, కేటీఆర్ కేటీఆర్ గారికి, కవిత గారికి, హరీష్ రావు గారికి శుభాకాంక్షలు. తెలంగాణని మరింత ఉన్నత స్థాయికి తీసుకుని వెళతారని ఆశిస్తున్నా అని రాంచరణ్ పేర్కొన్నారు.

    స్టైలిష్ ఫోటో

    ఈ సందర్భంగా తాను కేటీఆర్ తో ఉన్న స్టైలిష్ ఫోటోని రాంచరణ్ షేర్ చేశాడు. రాంచరణ్, కేటీఆర్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. పలు సందర్భాలలో రాంచరణ్, కేటీఆర్ కలసి కనిపించారు. చరణ్ ధృవ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. కేటీఆర్ నాకు స్నేహితుడు అని చరణ్ చాలా సందర్భాల్లో పేర్కొన్నాడు.

    మా అసోసియేషన్ ఆశలు

    మా అసోసియేషన్ ఆశలు


    కేసీఆర్ విజయంపై మా అసోసియేషన్ కూడా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ నేపథ్యంలో మా అసోసియేషన్ సొంత బిల్డింగ్ కోసం చిత్ర పరిశ్రమ కేసీఆర్ పై అసలు పెట్టుకుంది. టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు టాలీవుడ్ కి ఎంతో సహకారం అందించింది. టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించి మరోమారు అధికారంలోకి రావడం సంతోషంగా ఉందని మా అధ్యక్షుడు శివాజీ రాజా అన్నారు. టిఆర్ఎస్ హయాంలో తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని శివాజీ రాజా అన్నారు.

     మీ హయాంలోనే

    మీ హయాంలోనే

    మా అసోసియేషన్ తరుపున వృద్ధాశ్రమం నిర్మించడానికి, మా అసోసియేషన్ సొంత భవనం నిర్మించడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. కేసీఆర్ గారి హయాంలోనే ఆ పని పూర్తవుతుందని నమ్ముతున్నట్లు పరుచూరి వెంకటేశ్వర రావు అన్నారు. మా అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ సంవత్సరంలోనే సొంత భవనానికి శంకుస్థాపన జరుగుతుందని ఆశిస్తున్నట్లు పరుచూరి అన్నారు.

    English summary
    Ram Charan congratulates KCR and KTR for their Victory. Here is the full details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X