»   » ఫ్యూచర్ స్టార్స్ అంటూ... వారికి రామ్ చరణ్ అభినందన!

ఫ్యూచర్ స్టార్స్ అంటూ... వారికి రామ్ చరణ్ అభినందన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా జరిగిన సెమీస్ మ్యాచ్ లో భారత కుర్రాళ్ల జట్టు శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రామ్ చరణ్ కుర్రాళ్లను అభినందిస్తూ ఫ్యూచర్ స్టార్స్ అంటూ తన సోషల్ మీడియాలో పోస్టు చేసారు. ఫైనల్ లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.

India wins over Srilanka in Under 19 WC reaches final . Congratulations Team India . !!! #U19CWC #FutureStars

Posted by Ram Charan on Tuesday, February 9, 2016

బంగ్లాదేశ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. 268 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు 42.4 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. దీంతో 97 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. ఈ ఆటలో అద్భుతంగా రాణించిన అనుమోల్ ప్రీత్ సింగ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే...
రామ్ చరణ్ ‘థాని ఒరువన్' తమిళ చిత్రం రీమేక్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు పక్కా ప్లానింగుతో షెడ్యూల్ తయారు చేసినట్లు తెలుస్తోంది. జయం రవి, నయనతార, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో ఎం.రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘థాని ఒరువన్' చిత్రం తమిళంలో భారీ విజయం సాధించింది. ముఖ్యంగా ఇందులో విలన్ పాత్ర చేసిన అరవింద్ స్వామి హైలెట్ అయ్యాడు. ఇదే చిత్రాన్ని తెలుగులో రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.

Ram charan congratulates Under 19 Team India

సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. రామ్ చరణ్ ఈ మూవీలో పోలీస్ పాత్రలో నటించబోతున్నాడు. యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కూడా అరవింద స్వామి క్రిమినల్ సైంటిస్టుగా నటిస్తున్నాడు. తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘రక్షక్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. శృతి హాసన్, లేదా ఇలియానాను హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. తెలుగులో నటించడానికి అరవింద స్వామి రూ. 3 కోట్ల రెమ్యూనరేషన్ అడుగుతున్నాడట.

English summary
"India wins over Srilanka in Under 19 WC reaches final . Congratulations Team India. U19CWC‬ ‪‎Future Stars‬" Ram Charan siad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu