»   » రామ్ చరణ్ "ధృవ" ఫస్ట్ లుక్ కాపీ అంటున్నారు

రామ్ చరణ్ "ధృవ" ఫస్ట్ లుక్ కాపీ అంటున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న ధ్రువ సినిమా మీద ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. లాస్ట్ ఇయర్ బ్రూస్ లీ అంటూ వచ్చి అభిమానులను నిరాశ పరచిన చెర్రి చేస్తున్న సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో పనిచేస్తున్నాడట. తని ఒరువన్ రీమేక్ గా వస్తున్న ధ్రువ ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ అవ్వకుండానే తెలుగు ఆడియెన్స్ ను నచ్చేలా సినిమా చేస్తున్నారు.

అయితే ధృవ ఫస్ట్ లుక్ మీద కాపీ అంటూ కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల సురేందర్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన రామ్ చరణ్ ఫస్ట్ లుక్ కు అభిమానుల నుండి మంచి స్పందన లభించింది. చెర్రీ కంటి నుండి వెలువడుతున్న ఫార్ములాలతో నిండిపోయిన పోస్టర్, సరికొత్త అనుభూతులను ఫ్యాన్స్ కు పంచింది. అయితే ఈ సినిమా పోస్టర్ "కాపీ" అని సోషల్ మీడియాలో అసలు పోస్టర్, చెర్రీ పోస్టర్ ను పక్కన పెట్టి మరీ పోస్టులు చేస్తున్నారు.


Also Read: అన్ని జాగ్రత్తలతో సురేంద్ర రెడ్డి, అది చెప్పటానికే ఈ లుక్ వదిలారు


దీనితో ఇప్పటికే రకరకాల కారణాలతో షూటింగ్ లేట్ అవుతున్న ఈ సినిమా పై మొదట్లోనే నెగిటివ్ కామెంట్స్ దాడి ఏమిటి అని ఈ సినిమా యూనిట్ భయపడుతోంది అని టాక్. ఇప్పటికే తని ఒరువన్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా అని కామెంట్స్ వినపడుతున్న నేపద్యంలో ఇప్పుడు ఇలా ఈ సినిమా మొట్టమొదటి ఫస్ట్ లుక్ పోస్టర్ టార్గెట్ కావడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.


Ram Charan Dhruva First Look Poster is Copy

బ్రహ్మోత్సవం సమయం లోనూ.... ఇదే తరహాలో మహేష్ వాడిన బైక్ విశయం లో కూడా ఇలాంటి ఆరోపనలే వచ్చాయి. అక్కన్నుంచే బ్రహ్మోత్సవం కి మొదటి నెగటివ్ బేస్ పడింది. మరి ఇప్పుడు రామ్ చరణ్ విశయం లోనూ అదే తరహా వివాదం మొదలయ్యింది. "ధృవ" మూవీకి మొదట్లోనే నెగిటివ్ కామెంట్స్ రావడం చరణ్ ను కలవర పెడుతోంది అనే వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు అభిమానుల నుండి మంచి స్పందన లభించింది అన్న ఆనందం పూర్తిగా ఎంజాయ్ చేయకుండానే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కాపీ అంటూ వెబ్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ మొదలు అయ్యాయి.


అయితే కథ విశయం లో ఉన్న క్లారిటీ రామ్ ఎక్కడా తడబడటం లేదట... సినిమా రిలీజ్ అయితే ఇలాంటి చిన్న చిన్న విశయాలు ఎవరూ పట్టించుకోరు అన్న ధీమాతో ఉన్నాడట ఈ మెగా హీరో. ఇప్పటికే స్టార్ ఇమేజ్ రాకపోయినా వరుస హిట్లు కొడుతున్న మెగా హీరోల్లో కాస్త వెనుక పడి ఉన్న రామ్ చరణ్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టటం అవసరం. అందుకే తన పూర్థి కాన్సంట్రేషన్ ఈ సినిమా మీదే పెట్టాడట రామ్.

English summary
New controversy: Ram charan Dhruva First Look Copied from Hollywood Movie
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu