»   »  లాక్ చేస్కోండి ఇదే "ధృవ" రిలీజ్ డేట్ : అక్టోబర్లో కాదు సెప్టెంబర్ లోనే

లాక్ చేస్కోండి ఇదే "ధృవ" రిలీజ్ డేట్ : అక్టోబర్లో కాదు సెప్టెంబర్ లోనే

Posted By:
Subscribe to Filmibeat Telugu

బ్రూస్‌లీ వంటి భారీ డిజాస్టర్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం "ధృవ". తమిళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న "తని ఒరువన్" సినిమాకు ఇది రీమేక్ అనే విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది.

రాం చరణ్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఇది ఓ రీమేక్ సినిమా కావడంతో షూటింగ్ త్వరగా అయిపోతుందని.. ఆ తరువాత ఆగష్టులో విడుదల చేద్దామని అనుకున్నారు దర్శకనిర్మాతలు. కానీ కొన్ని కారణాల వలన అది కుదరలేదు. తరువాత అక్టోబర్ సెకెండ్ వీక్ లో విడుదల అని ప్రకటించారు ఇప్పుడు ఈ డేట్ కూడా మారేలా ఉంది కాకపోతే ఆలస్యం కావటం లేదు అనుకున్న దానికంటే ముందే వస్తోంది....

ఒక సినిమా రిలీజ్ డేట్ ఇచ్చి దాన్ని పోస్ట్ పోన్ చేయడమే తప్ప.. ప్రిపోన్ చేయడం అన్నది ఏ ఇండస్ట్రీలో అయినా అరుదైన విషయమే. ఐతే రామ్ చరణ్ సినిమా "ధ్రువ"ను విడుదల తేదీని మాత్రం ముందుకు తెస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం అయితే ఈ సినిమాను అక్టోబరు రెండో వారానికి రిలీజ్ చేయాలి.

Ram charan Dhruva movie release date

ఐతే రామ్ చరణ్‌కు అక్టోబరు సెంటిమెంటు కలిసి రాదన్నసెంటిమెంట్ కూడా ఉండటం తో అల్లు అరవింద్ అప్రమత్తం అయ్యాడో ఏంటో తెలియదు కానీ. ఈ చిత్రాన్ని కాస్త ముందుకు జరిపి సెప్టెంబరు 30నే విడుదల చేయాలని ఫిక్సయ్యారు. అక్టోబరు 11న దసరా రానున్న నేపథ్యంలో పండక్కి వారం రోజుల ముందే సెలవులు మొదలవుతాయి. ఆ ముందు వీకెండ్లోనే సినిమాను రిలీజ్ చేస్తే రెండో వారమంతా సెలవుల్లో కలెక్షన్ల పంట పండించుకోవచ్చని అరవింద్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఐతే రెండో వారం కూడా అదరగొట్టాలి అంటే ముందు సినిమాకు పాజిటివ్ టాక్ రావాలి. ఇది తమిళ బ్లాక్‌బస్టర్ "తనీ ఒరువన్కు" రీమేక్ కాబట్టి సినిమా కచ్చితంగా ఆడుతుందన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు అరవింద్. నిజానికి "ధ్రువ" ఆగస్టులోనే రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ తన చెల్లెల్లి పెళ్లి పనులు, తండ్రి 150వ సినిమాకు సంబంధించిన హడావుడిలో పడి రామ్ చరణ్ చాలా లేటుగా షూటింగ్‌కి రావడంతో లేటుగా రిలీజ్ చేయాల్సి వస్తోంది.

సురేంద్ర‌రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ గా సాగుతుంది. ఒక కేసు విష‌య‌మై హీరో చేసే ఒంటరి పోరాట‌మే ఈ సినిమా క‌థ‌. విల‌న్ గా త‌మిళ్ లో అద్భుతంగా చేసిన అర‌వింద స్వామినే తెలుగు లో కూడా చేస్తున్నాడు.

English summary
Mega power star Ram Charan's Telugu actioner Dhruva, which is being directed by Surender Reddy, will hit the theaters worldwide on September 30.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu