»   » ఫ్రైడే రిలీజ్ అవుతున్న‘ఆరెంజ్’పై ఉత్కంఠ నాకూ తెలీదు అంటున్నచరణ్

ఫ్రైడే రిలీజ్ అవుతున్న‘ఆరెంజ్’పై ఉత్కంఠ నాకూ తెలీదు అంటున్నచరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ సెన్సేషనల్ హిట్ 'మగధీర" తర్వాత ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ మద్య ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి 'ఆరెంజ్" సిద్దమౌతోంది. నిన్న రామ్ చరణ్ తిరుమల వెళ్ళి వెంకన్నను దర్శించుకొని వెనుదిరిన సందర్భంలో కొందరు అభిమానులు 'ఆరెంజ్" ఎలా ఉండబోతుందని అడిగితే 'నాకూ తెలీదు. నేనూ మీలాగే ఎదురు చూస్తున్నాను" అని సమాధానమిచ్చాడు. ఆ దెబ్బకు అభిమానులు విస్తుపోయారు. తమ అభిమాన హీరో నోటి వెంట ఇలాంటి సమాధానం ఎక్స్ పెక్ట్ చెయ్యని అభిమానులకి షాక్ గురైనంత పనియ్యింది.

అందరికీ సినమా మీద డౌట్స్ వున్నట్టే చరణ్ కి కూడా డౌట్ వుందా?నాగబాబు మాటల్లో కూడా అదే ధ్వనిస్తోంది. ఒక పెద్ద సినిమాకి రిలీజ్ కి ముందే ఇలాంటి నెగెటివ్ టాక్ స్ర్పెడ్ అవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా 'ఆరెంజ్" సినిమాకి సంబందించి అభిమానులకే కాదు 'ఆరెంజ్" చిత్రం షూటింగ్ లో పాల్గొన్న యూనిట్ సభ్యలు ఏ ఒక్కరూ ఉత్సాహంగా, కాన్ఫిడెంట్ గానూ కనిపించలేదు అందుకు కారణం సినిమా బాగా రాకపోవడమే అని మరి కొందరి సమాచారం.

అయితే కొంతమంది అభిమానులు మాత్రం శంకర్ దర్శకత్వంలో వచ్చిన రజనీకాంత్ నటించిన రోబో కూడా మొదట ఇలాగే నెగటివ్ టాక్ తో వచ్చి తర్వాత పెద్ద హిట్టే కొట్టింది. మరి అలాగే 'ఆరెంజ్" కూడా సూపర్ హిట్ అయి తీరుతుందని తమకి తాము ధైర్యం చెప్పుకొంటూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu