»   » రామ్ చరణ్‌కు తీవ్ర అనారోగ్యం, షూటింగ్ నిలిపివేత!

రామ్ చరణ్‌కు తీవ్ర అనారోగ్యం, షూటింగ్ నిలిపివేత!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగులో ఉండగా రామ్ చరణ్ తీవ్రమైన జ్వరం భారి పడ్డారు. చెర్రీ షూటింగులో పాల్గొనలేని స్థితిలో ఉండటంతో షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేసారు.

Ram Charan down with high fever

ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా తన సోషల్ నెట్వర్కింగ్ పేజీ ద్వారా అభిమానులకు తెలియజేసాడు. 'హై ఫీవర్ భారీ పడ్డాను. జ్వరం కారణంగా నా పరిస్థితి చాలా బ్యాడ్‌గా ఉంది. గోవిందుడు అందరి వాడేలే సినిమా షూటింగ్ కొన్ని రోజులు ఆపక తప్పలేదు. త్వరలో కోలుకుని షూటింగులో పాల్గొంటాను' అని తెలిపాడు.

Post by Ram Charan.

పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మాణంలో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుటుంబకథా చిత్రం "గోవిందుడు అందరివాడేలే". ఈ సినిమాలో రామ్ చరణ్, శ్రీకాంత్, కాజల్ అగర్వాల్, కమలినీ ముఖర్జీ, రాజ్ కిరణ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ చిత్రంలో రామ్ చరణ్‌ సొంతగడ్డపై అడుగుపెట్టిన ప్రవాస భారతీయుడిగా పోనీ టెయిల్‌తో కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్ర యూనిట్ కన్యాకుమారి, పొలాచ్చి షెడ్యూల్స్‌ పూర్తి చేసుకుని హైదరాబాద్‌ చేరింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.

English summary
“Down with high fever … Feel bad as GAV shoot halts fr few days. Will be back in full swing soon..” – Ram Charan posted on face book.

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu