»   » సాధించింది గోరంత సాధించాల్సింది కొండంత: రామ్‌ చరణ్

సాధించింది గోరంత సాధించాల్సింది కొండంత: రామ్‌ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ స్థాయిలో రూపుదిద్దుకుని ప్రేక్షకుల మన్ననలు పొందిన 'మగధీర' చిత్రం రామ్‌ చరణ్‌ తేజకు రెండో సినిమా. 78 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన కథానాయకుడుగా రామ్‌ చరణ్‌ తేజ సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. రామ్‌ చరణ్ మూడవ చిత్రం 'ఆరంజ్' మరో వారం పదిరోజుల్లో మనముందుకు రానున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆస్ట్రేలియా వెళ్ళేందుకు ముందు మీడియాను కలిసిన చరణ్ పలు విషయాలు వెల్లడించారు.

'మగధీర' తర్వాత మీలో వచ్చిన మార్పేంటి? ఏమీ లేదండి. ఎందుకంటే నా బిగ్గెస్ట్ క్రిటిక్స్ నా ఇంట్లోనే ఉన్నారు. 'సాధించింది గోరంత సాధించాల్సింది కొండంత' అనే సిద్ధాంతంతోనే ముందుకు సాగాలన్నది మా నాన్నగారి దగ్గర్నుంచి నేను నేర్చుకున్నాను. కాకపోతే అయిదారు సినిమాల కోసం శ్రమపడినట్లు 'మగధీర' కోసం కష్టపడ్డాం. కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందనే సంతృప్తి, ఆనందం మాత్రం ఉంది. అంతకు మించి నాలో మార్పేమీ లేదు. ఈ విషయం నేనేదో ముఖస్తుతి కోసం చెప్పడంలేదు. నిజంగానే చెబుతున్నానన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu