»   »  1 మిలియన్: రామ్ చరణ్ స్పీడు చూసారా?

1 మిలియన్: రామ్ చరణ్ స్పీడు చూసారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సోషల్ నెట్వర్కింగులో దూసుకెలుతున్నాడు. తాజాగా రామ్ చరణ్ ఫేస్ బుక్ అకౌంటును ఫాలోఅయ్యే వారి సంఖ్య 1 మిలియన్ మార్కు అందుకుంది. ఒకప్పుడు ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో నిత్యం టచ్‌లో ఉండే రామ్ చరణ్....పెళ్లి తర్వాత ట్విట్టర్ అకౌండ్ క్లోజ్ చేసిన సంగతి తెలిసిందే.

కొన్ని రోజుల గ్యాప్ తర్వాత ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసి మళ్లీ అభిమానులకు టచ్‌లోకి వచ్చిన చెర్రీ......అనతి కాలంలోనే 10 లక్షల పైచిలుకు ఫాలోవర్స్‌ను సొంతం చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన 'ఎవడు' సినిమా హిట్టయిన నేపథ్యంలో ఆయనకు ఫాలోయింగ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Ram Charan Facebook 1 million mark

ఎవడు సినిమా వివరాల్లోకి వెళితే.... బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం దుమ్ము రేపుతోంది. పరిస్థితి చూస్తుంటే ఈ చిత్రం ఫస్ట్ వీక్ కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ఆదివారం విడుదలైన ఈచిత్రం ఇప్పటికే ఏపీ బాక్సాఫీ వద్ద దాదాపు రూ. 20 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

మాస్ మసాలా, యాక్షన్, కామెడీ, మ్యూజిక్ లాంటి ఫుల్లీ లోడెడ్ కమర్షియల్ అంశాలతో సినిమా ఉండటంతో పాటు పండగ సీజన్ కావడంతో థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్లతో కళకళలాడుతున్నాయి. మరో వైపు ఈ సినిమాతో పాటు విడుదలైన మహేష్ బాబు '1 నేనొక్కడినే' చిత్రానికి నెగెటివ్ టాక్ రావడం కూడా చరణ్‌కు కలిసొచ్చింది. ఎవడు చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. రామ్ చరణ్, అమీ జాక్సన్, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించారు. అల్లు అర్జున్, కాజల్ ఈచిత్రంలో అతిథి పాత్రల్లో నటించారు.

English summary
Mega Power Star Ram Charan has hitted the 1 million mark finally in social networking sites. After Allu Arjun and Kajal making 1 million likes for their official Facebook pages now its turn of Ram Charan to get the 1 million mark tag of celebrities.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu