»   » మరీ ఇంత స్పీడా..! హైదారాబాద్ లో ధృవ షూటింగ్

మరీ ఇంత స్పీడా..! హైదారాబాద్ లో ధృవ షూటింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ర‌కుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్ గా, ఏస్ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాతగా, ప్రతిష్టాత్మక చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన గీతా ఆర్ట్స్ బ్యానర్లో, స్టైలిష్ డైరెక్టర్ గా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ధ్రువ. ఈ చిత్రం ఇటీవ‌లే కాశ్మిర్ షెడ్యూల్ పూర్తిచేసుకుని జులై నెలాఖ‌రువ‌ర‌కూ హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

అగ‌ష్టు లో సాంగ్స్ చిత్రీక‌ర‌ణ చేస్తారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ న్యూ లుక్ లో కనిపించబోతున్నారు. క్యారెక్టర్ పరంగా చరణ్ స్టన్నింగ్ లుక్ తో అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరించనున్నాడు. చ‌ర‌ణ్‌ దీని కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారు. విభిన్నమైన కథతో , ఆశ‌క్తిక‌ర‌మైన క‌థంశంతో రామ్‌ చరణ్, సురేందర్ రెడ్డి, అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్ర నిర్మాణం జరుగుతోంది. తమిళంలో వంద కోట్ల మైలురాయిని దాటిన తని ఒరువన్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఫెర్‌ఫార్మెన్స్‌, ర‌కూల్‌ ప్రీత్ సింగ్ అందచందాలు చిత్రానికి హైలెట్ గా నిలిస్తే, అరవింద్ స్వామి పెర్ ఫార్మెన్స్ ఈ చిత్రానికి మ‌రో హైలైట్ గా నిలుస్తాయి.

 Ram Charan film Dhruva shooting in Hyderabad

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అల్లు అర‌వింద్ మాట్లాడుతూ.... మెగాపవ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ హీరోగా , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే కాశ్మిర్ లో మెలోడి సాంగ్ చిత్రీక‌ర‌ణ చేసుకున్నారు. రాంచరణ్ ఈ క్యారెక్టర్ చాలా ఫ్యాష‌న్ గా చేస్తున్నాడు. ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి చ‌ర‌ణ్ ని చాలా ఢిఫ‌రెంట్ లుక్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు.

సురేందర్ రెడ్డి స్టైలిష్ మేకింగ్ ని మరోసారి చూడబోతున్నాం. అరవింద్ స్వామి క్యారెక్టరైజేషన్ ఈ చిత్రానికి మరో ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. యాక్షన్ పార్ట్ ని గ్రాండియర్ గా షూట్ చేశాము. అగ‌ష్టు లో సాంగ్స్ చిత్రీక‌ర‌ణ చేస్తాము. అగ‌ష్టు 15 ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ చేస్తాము. త్వ‌ర‌లో టీజ‌ర్ ని అక్టోబ‌ర్ లో చిత్రాన్ని విడుద‌ల చేస్తాము. అని అన్నారు.

రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నిన్నటి ప్రముఖ తమిళ హీరో అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే, న‌వ‌దీప్‌, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

English summary
The Druva shooting will take place at the big Office complex in IT Zone in Gachchibowli in Hyderabad. Directed by Surrender Reddy this film has Rakul Preet as its leading lady. The film is a remake of Tamil movie Thani Oruvan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu