twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ పనేదో ఇంట్లోనూ చెయ్యచ్చుగా రామ్ చరణ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : రామ్ చరణ్ తాజా చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' లో కథ ప్రకారం విడిపోయిన తండ్రిని,బాబాయ్ లను కలిపే భాధ్యత తీసుకుంటాడట. అదే పాత్ర తీరును ఇంట్లోనూ తీసుకోవచ్చుగా అంటున్నారు. ఆయన తండ్రి చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్ సిద్దాంతాలు పరంగా విడిపోయారని, వారిని ఏకం చేసే భాధ్యతను తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు. తెరమీద అయినంత ఈజీగా నిజ జీవితంలో కష్టం అయినా రామ్ చరణ్ తలుచుకుంటే అదెంత అంటున్నారు.

    ఇక ఈ చిత్రం కథ గురించి నిర్మాత మాట్లాడుతూ... సమాజం బాగుండాలంటే కుటుంబాలు బాగుండాలి. కుటుంబం బాగుండాలంటే అందులోని బంధాలూ బలంగా ఉండాలి. ఆ బంధానికి నమ్మకమే పునాది. ఆ నమ్మకాన్ని నిలబెట్టి, తన కుటుంబంలో ఆనందాల దీపాల్ని వెలిగించడానికి ఓ యువకుడు చేసిన ప్రయత్నం... 'గోవిందుడు అందరివాడేలే' అన్నారు. రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. కాజల్‌ హీరోయిన్. కృష్ణవంశీ దర్శకుడు. బండ్లగణేష్‌ నిర్మాత. శ్రీకాంత్‌, రాజ్‌కిరణ్‌, కామ్నా జెఠ్మలానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

    Ram Charan 'Govindudu Andarivadele' about Family relations

    చిత్రం షూటింగ్ ప్రస్తుతం రాజధానిలో జరుగుతోంది. నగర శివార్లలో వేసిన ఓ సెట్‌లో రామ్‌చరణ్‌పై ఫైటింగ్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. వీటికి రామ్‌ - లక్ష్మణ్‌ నేతృత్వం వహిస్తున్నారు. రాజ్‌కిరణ్‌, మిత్ర, కాశీవిశ్వనాథ్‌ తదితర తారాగణం కూడా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ''కుటుంబ బంధాలకు పెద్దపీట వేసిన చిత్రమిది. ఇంటిల్లిపాదికీ నచ్చేలా తీర్చిదిద్దుతున్నాం. రామ్‌చరణ్‌ కెరీర్‌లో ఇదో మైలురాయిలా నిలుస్తుంది'' అని చెబుతున్నారు.

    ఆడవారి మాటలకు అర్థాలే వేరులే పాటని ఈ చిత్రంలో రీమిక్స్‌ చేస్తున్నట్టు సమాచారం. రామ్‌చరణ్‌ తండ్రి పాత్రలో ప్రముఖ నటుడు కనిపించబోతున్నారు. ఆయనెవరేది త్వరలో తెలుస్తుంది. ఈ చిత్రానికి యువన్‌శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.

    English summary
    
 Ram Charan has joined Creative Director Krishnavamsi in making a film titled ‘Govindudu Andarivadele’. Kajal is playing opposite Ram Charan. Bandla Sivababu is presenting it on the banner Parameswara Art Productions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X