»   » నందమూరి హీరోకు రామ్ చరణ్ ప్రశంసలు!

నందమూరి హీరోకు రామ్ చరణ్ ప్రశంసలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన 'ఓమ్' చిత్రం ఈ నెల 19న విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రచారం నిమిత్తం ఇప్పటికే పలువురు ప్రముఖులకు ప్రత్యేక షోలు వేసారు. ఇటీవల రజనీకాంత్ 'ఓం' సినిమా చూసి చాలా బాగుందని, కళ్యాణ్ రామ్ మంచి సబ్జెక్టు, స్టాండర్డ్స్ ఉన్న సినిమాతో ప్రేక్షకులకు రాబోతున్నాడని, 3 టెక్నీలజీని చాలా బాగా వాడుకున్నారని ప్రశంసించిన సంగతి తెలిసిందే.

ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం...తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా 'ఓమ్' చిత్రానికి సంబంధించి కొన్ని రషెస్ చూసాడని, కళ్యాణ్ రామ్ ప్రయత్నాన్ని ప్రశంసించాడని, బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలను సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేసినట్లు సమాచారం.

కళ్యాణ్ రామ్ ఈ సినిమాపై భారీ అశలు పెట్టుకోవడం తో పాటు, తన మార్కెట్ పరిధిని మించి పెట్టుబడి కూడా అధికంగా పెట్టాడు. ఈ సినిమా తన కెరీర్‌ను నిలబెడుతుందనే నమ్మకంతో ఉన్నాడు కళ్యాణ్. సినిమాకు పబ్లిసిటీ పెంచేందుకు రకరకాల పద్దతులను అవలంభిస్తున్నాడు.

కృతి కర్బందా, నికీషా పటేల్‌ హీరోయిన్స్. సునీల్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్‌ బేనర్‌పై కళ్యాణ్ రామే నిర్మించారు. 3డిలో రూపొందిన 'ఓం' ఈ చిత్రానికి హాలీవుడ్ చిత్రాలైన స్టెప్ అప్ 3డి, ఫైనల్ డెస్టినేషన్, అవతార్, స్పైడర్ మ్యాన్ 4 లాంటి చిత్రాలకు పని చేసిన టెక్నీషన్స్ పనిచేసారు. ఆచు, సాయి కార్తీ సంగీతం అందించారు.

ఈ చిత్రంలో కార్తీక్‌, సురేష్‌, రావు రమేష్‌, రఘు, సితార తదితరులు నటించారు. కూర్పు: గౌతమ్‌రాజు, కళ: కిరణ్‌, స్టీరియోగ్రాఫర్స్‌: డేవిడ్‌ మైక్‌టేలర్‌, మార్కస్‌, మజ జ్డోవిన్‌స్కీ; ఫైట్స్‌: విజయ్‌, రవివర్మ; సంగీతం: అచ్చు, సాయికార్తీక్‌.

English summary
It is heard that Charan happened to watch few rushes of the 'OM' and was blown away. He has reportedly hailed Kalyanram for his efforts and is positive that the film would work at the box office.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X