»   » రామ్ చరణ్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇలా...

రామ్ చరణ్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు, ప్రేక్షకులకు తన సోషల్ నెట్వర్కింగ్ పేజీ ద్వారా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. భారత సైనికులతో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేసాడు.

Happy Independence Day !!! 🇮󾓭

Posted by Ram Charan on Friday, August 14, 2015

రామ్ చరణ్ తాజా సినిమా విషయానికొస్తే...
విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి. 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ఈరోజు నుంచి హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది.

మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' తో పాటు ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా టాకీ పార్ట్ కు సంభందించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు నిర్మాత దానయ్య డి.వి.వి. గత నెల 27 నుంచి బ్యాంకాక్ లో జరిగిన షూటింగ్ లో 'మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' నాయిక రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా బ్యాంకాక్ లో భారీ పతాక సన్నివేశాలను, భారీ వ్యయంతో చిత్రీకరించామని తెలిపారు. అలాగే టాకీ పార్ట్ కు సంభందించిన సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు తెలిపారు. బ్యాంకాక్ లో చిత్రీకరించిన సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని తెలిపారు నిర్మాత దానయ్య.

 Ram Charan Independence Day wishes

విజయదశమి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రానికి సంభందించి ఇంకా ఎలాంటి పేరును నిర్ణయించలేదని తెలిపారు. నాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' తో తాను రూపొందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు 'శ్రీను వైట్ల' మాట్లాడుతూ " ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్ 'కథా చిత్రం గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు.

ఈ చిత్రానికి కథ : కోన వెంకట్, గోపి మోహన్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: ఉపేంద్ర మాధవ్ , ప్రవీణ్ లైన్ ప్రొడ్యూసర్ : కృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి. వై. ప్రవీణ్ కుమార్ సమర్పణ : డి. పార్వతి నిర్మాత : దానయ్య డి.వి.వి. మూలకథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : శ్రీను వైట్ల.

English summary
Ram Charan Independence Day wishes.
Please Wait while comments are loading...