»   »  ఈతరం 'జగదేకవీరుడు' చరణే

ఈతరం 'జగదేకవీరుడు' చరణే

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ram Charan Teja
తన తండ్రి చేసిన పాటలే కాక పాత్రల్లో కూడా ప్రవేశిస్తానని చరణ్ చెప్తున్నాడు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తొంభైల్లో వచ్చిన జగదేకవీరుడు..అతిలోక సుందరి అప్పట్లో సంచలన విజయం నమోదు చేసింది. ఇప్పుడు ఆ సినిమా ముగింపుతో ప్రారంభించి ఓ కొత్త కథను రూపొందిస్తున్నామని నిర్మాత అశ్వనీదత్ చెప్పారు. అయితే హీరో ఎవరు అన్న దానికి చరణ్ ఇంకెవరు తానే అని సమాధానం అన్యాపదేశంగా చెప్పారు. ఈ విషయంమై మీడియాతో మాట్లాడుతూ అప్పటికీ...ఇప్పటికీ తన ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్ ఆ సినిమా అని,తను ఆ సినిమాలోని జై చిరంజీవ పాటంటే ఇష్టమని ...అన్నీ అనుకూలంగా కుదిరితే 2010లో తను హీరోగా సినిమా ప్రారంభించవచ్చునని అంటున్నాడు. మరి శ్రీదేవి పాత్ర ఎవరు వేస్తారంటే చిరునవ్వే సమాధానమిస్తున్నాడు.అంటే త్వరలో జగదేకవీరుడు సీక్వెల్ కబురు వినవచ్చన్నమాట. అయినా చరణ్ కి ఇక కథల కొరత ఉండదు...చక్కగా తన తండ్రి చేసిన సినిమా సీక్వెల్స్ చేసుకుంటే చాలు...ఇబ్బంది ఉండదంటున్నారు సీనియర్లు. లక్ కదా...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X