»   » అపోలో ఆసుపత్రిలో రామ్ చరణ్‌కు సర్జరీ

అపోలో ఆసుపత్రిలో రామ్ చరణ్‌కు సర్జరీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు త్వరలో సర్జరీ జరుగబోతోంది. అయితే అభిమానులు కంగారు పడాల్సిన పనిలేదు. కొంత కాలంగా రామ్ చరణ్ సైనస్ సమస్యలతో సతమతం అవుతున్నాడు. అందుకే ఆయనకు అపోలో ఆసుపత్రిలో చిన్నపాటి సర్జరీ చేయనున్నారట.

ప్రస్తుతం చరణ్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' విడుదలకు సిద్ధం అవుతుండటంతో ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నాడు చెర్రీ. ఈ క్రమంలో సైనస్ సమస్య చెర్రీని తీవ్రంగా ఇబ్బంది పెడుతుందట. సర్జరీ జరిగినే ఆ ఇబ్బంది నుంచి ఉపశమనం కలుగుతుందని వైద్యులు తెలిపినట్లు సమాచారం.

Ram Charan Teja

రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో తెలుగులో నటించిన 'ఎవడు'. శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్లు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా రాష్ట్రంలో నెలకొన్న ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాల కారణంగా వాయిదా పడింది.

చరణ్ హిందీలో నటించిన 'జంజీర్' చిత్రాన్ని తెలుగులో తుఫాన్ పేరుతో విడుదల చేయబోతున్నారు. సెప్టెంబర్ 6న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అపూర్వ లఖియా దర్శకత్వం వహించిన ఈచిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్. రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, అడాయ్ మెహ్రా ప్రొడక్షన్స్, మరియు ఫ్లయింగ్ టర్టిల్ ఫిల్మ్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు.

English summary
Mega Power star Ram Charan to join the Apollo Hospital for a minor surgery due to chronic Sinus. ‘I am not completely well. Sinus is troubling me at the moment’ He said.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu