»   » మళ్ళీ హిస్టరీ రీక్రియేట్ చేయనున్న రామ్ చరణ్-కాజల్...!

మళ్ళీ హిస్టరీ రీక్రియేట్ చేయనున్న రామ్ చరణ్-కాజల్...!

By Sindhu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  జీవితంలో పెద్ద పొజిషన్ కి వెళ్లే కొద్దీ ఏం మాట్లాడినా కాస్త ఆచితూచి మాట్లాడాలంటారు. మాటల్లో ఏమాత్రం తేడా వచ్చినా అందరూ ఉతికి ఆరేసేస్తారు. ఈమధ్య పెద్ద కళ్ళ కాజల్ పరిస్థితి కూడా అలాగే అయింది కాబోలు అయితే మీలో ప్రతిభ ఉంటే ఎదురుదెబ్బలు తాత్కాలికమే.. ఇది అక్షర సత్యమని నిరూపించింది కాజల్ అగర్వాల్. ప్రతిభావంతురాలైన ఈ హాట్ బ్యూటీ ఇటీవలి వరకూ బాక్స్ ఆఫీసు వద్ద తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. అయితే ఫోటోషూట్ వ్యవహారంలో వెల్లువెత్తిన ఆరోపణలను తిప్పికొట్టడంలో ఆమె కాస్త విఫలమవటంతో దీని ప్రభావం ఆమె కెరీర్ ను ప్రభావితం చేసింది.

  ఇప్పటివరకూ ఆమెకు ప్రిన్స్ మహేష్ బాబు 'బిజినెస్ మ్యాన్" చిత్రం మాత్రమే చేతిలో ఉంది. కొంత కాలంగా కొత్త ప్రాజక్ట్ లు, బాక్స్ ఆఫీసు వద్ద విజయాలతో సమంత , తమన్నా, కాజల్ ను వెనక్కు నెట్టారు. అయితే తాజాగా శ్రుతి హసన్ డేట్స్ సర్దుబాటు కాక, యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'దమ్ము" మూవీ నుంచి వైదొలగటంతో ఆ అవకాశం కాజల్ అంది పుచ్చుకొని మళ్లీ లైంలైట్ లోకి వచ్చింది. ఈ రిప్లేస్మెంట్ అవకాశం ఫై కాజల్ యమ కుషీగా ఉందంట.

  అంతేకాదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మ తాజాగా సీటు సంపాదించుకుంది. ఈ మూవీ కి వివి వినాయక దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబరులో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు వున్నాయి. చరణ్ కు సరిపడే కథ ఇది. మాస్ అంశాలతో సాగుతుంది. వినాయక్ శైలిలో యాక్షన్ ఘట్టాలు వుంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దీంతో కాజల్ హవా మళ్లీ మొదలయినట్టు అనిపిస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అతిపెద్ద హీరోలయిన ఈ ముగ్గురితో రొమాన్స్ చేసేందుకు ఈ హాట్ బ్యూటీ సిద్ధంగా ఉంది. ఈ నేపధ్యంలో మళ్లీ తెలుగు తెరపై కాజల్ సందడి మొదలుకానుంది. ఈ దీపావళి ఆమె కోసం బంపర్ ఆఫర్ నే తెచ్చినట్టు కనిపిస్తోంది.

  English summary
  Tollywood’s biggest ever grosser Magadheera is still on top even after two years. None of the films came close to Magadheera’s all time record till date. Ram Charan and Kajal sizzled in this monstrous hit and have been tagged as blockbuster pair.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more