»   » చిరు పుట్టిన రోజున చరణ్-కొరటాల మూవీ

చిరు పుట్టిన రోజున చరణ్-కొరటాల మూవీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇటీవల హీరో ప్రభాస్ తో 'మిర్చి' సినిమాను తీసి మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు కొరటాల శివ, నెక్ట్స్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. వరుసగా భారీ చిత్రాలను నిర్మిస్తూ టాలీవుడ్ లో అగ్రనిర్మాతగా రాణిస్తున్న బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.

తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రం ఆగస్టు 22న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈచిత్రం షూటింగ్ జులై నెలలోనే ప్రారంభం కావాల్సి ఉండగా ఆగస్టు 22కు వాయిదా పడింది. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడం గమనార్హం.

ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ స్క్రిప్టును ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడు. లో కథ ..పూర్తిగా బ్రదర్ సెంటిమెంట్ మీద బేస్ చేసుకుని నడుస్తుందని సమాచారం. సెంటిమెంట్,యాక్షన్ కలిసి ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. క్యాధరిన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే మరో హీరోయిన్ ఫైనల్ కానుంది.

మిర్చి చిత్రంలో ప్రభాస్ ను అద్భుతంగా ప్రజెంట్ చేసిన కొరటాల శివ....రామ్ చరణ్‌ను ఆయన గత సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ లుక్, డిఫరెంట్ కథాంశంతో ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌కు భిన్నంగా ఈ సినిమా ఉండనుంది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం 'ఎవడు' పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

English summary
Mega Power star Ram Charan's new film to be directed by Koratala Siva will kick off from the 22nd, August. Buzz is that Siva is done with the script and is currently finalizing the cast and crew for the project, which is produced by Bandla Ganesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu