»   » జనవరిలోనే రామ్ చరణ్ కొబ్బరికాయ

జనవరిలోనే రామ్ చరణ్ కొబ్బరికాయ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ram Charan
హైదరాబాద్ : 'తుఫాన్‌' తర్వాత చరణ్‌ కాస్త విరామం తీసుకొన్నారు. కుటుంబానికి సమయం కేటాయించాడు. మధ్యమధ్యలో కొత్త సినిమాలకి సంబంధించిన పనుల్ని చక్కబెట్టే ప్రయత్నం కూడా చేశారు. కృష్ణవంశీ దర్శకత్వం వహించబోతున్న మల్టీస్టారర్‌ చిత్రంలో నటించబోతున్నారు. దానికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం చిత్రబృందం లొకేషన్ల ఎంపికలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. జనవరిలో చిత్రానికి కొబ్బరికాయ కొట్టబోతున్నారని సమాచారం.

ఇటీవల ఇంటిల్లిపాదినీ మెప్పించే ఫ్యామిలీ కథలపైనే రామ్‌చరణ్‌ ఎక్కువగా దృష్టిపెడుతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే కృష్ణవంశీ సిద్ధం చేసిన కథని ఎంచుకొన్నారు. తదుపరి కూడా అదే తరహాలో సాగే ఓ కథలో నటించబోతున్నారని ప్రచారం సాగుతోంది. కుటుంబ కథా చిత్రాలని బాగా తీస్తారని పేరున్న దశరథ్‌ ఇటీవల రామ్‌చరణ్‌ని దృష్టిలో ఉంచుకొని ఓ కథని సిద్ధం చేసుకొన్నారట. అది త్వరలోనే ఆయనకి వినిపించబోతున్నారని తెలుస్తోంది. దీంతో మరికొన్ని కథల్ని కూడా రామ్‌ చరణ్‌ విన్నట్టు తెలుస్తోంది. వచ్చే యేడాది రామ్‌చరణ్‌ రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి.

ఇక 'వంద మందిని పంపినా... అదే రిపీటవుతుంది' అంటూ చరణ్‌ ఓ డైలాగ్‌ చెప్పాడు 'ఎవడు' చిత్రంలో. ఇప్పుడు ఆయన అభిమానులు కూడా అదే డైలాగే చెబుతున్నారు. ''2013 సంక్రాంతికి 'నాయక్‌' చిత్రంతో విజయం అందుకొన్నాడు చరణ్‌. 2014 పండగకి కూడా మళ్లీ అదే రిపీట్‌ చేస్తాడు'అంటున్నారు.

సినిమాలకి మంచి సీజన్‌ సంక్రాంతి. ఓ మాదిరి సినిమాకైనా ప్రేక్షకుల ఆదరణ దక్కుతుంది. ఇక చరణ్‌లాంటి స్టార్‌ కథానాయకుడి సినిమాకి అడ్డూ అదుపూ అన్నదే ఉండదు. భారీస్థాయిలో ప్రారంభ వసూళ్లు దక్కుతాయి కాబట్టి... విజయావకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఈ చిత్రంలో చరణ్‌ కనిపించే విధానం కొత్తగా ఉంటుందని చెబుతోంది చిత్రబృందం. ఆయనతో పాటు అల్లు అర్జున్‌ కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. బావాబావమరుదులు కలిసి చేసిన తొలి చిత్రం ఇదే కావడంతో అభిమానులు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. సైంటిఫిక్‌ అంశాలతో తెరకెక్కిన థ్రిల్లర్‌ చిత్రంగా ఇది ప్రచారంలో ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.

English summary
Finally, the wait is over for Mega Powerstar Ram Charan's next movie which is confusing mega fans from a long time. After the release of Thoofan, Charan took couple of months time to finally confirm his next Mega project. Producer Bandla Ganesh has finally confirmed that Ram Charan is going to feature in a brilliant multi-starrer that is going to be directed by creative director Krishna Vamsi. 
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu