తండ్రి టైటిల్ నే రామ్‌చరణ్ కొత్త సినిమాకి...

ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకూ అక్కడ షూటింగ్ జరుగుతోంది. కుటుంబ నేపథ్యంలో వచ్చే కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. చరణ్‌తోపాటు ప్రధాన తారాగణమంతా చిత్రీకరణలో పాల్గొంటోంది. దూరం మనషులకే కానీ, మనసులకు కాదు అని తెలియచేస్తూ హీరో తెగిన బంధాలను ఒక్కటి గా చేసే విజేతగా కనిపిస్తాడని చెప్తున్నారు. ఈ నెలాఖరుకు ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నారు.
ఈ చిత్రంలో చరణ్ విదేశాల్లో చదువుకొనే ఓ యువకుడిగా నటిస్తాడని తెలుస్తోంది. మే నుంచి విదేశాల్లో చిత్రీకరణ జరుపుతారని సమాచారం. ''కుటుంబ అనుబంధాలతో పాటు, చరణ్ శైలికి తగ్గ మాస్ అంశాలు కూడా చిత్రంలో ఉంటాయి''అని నిర్మాత చెబుతున్నారు. నలభై రోజులపాటు ఈ షెడ్యూల్ సాగుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ- ''కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు, తెలుగు సంప్రదాయాలు కలగలిపి తీర్చిదిద్దుకున్న కథ ఇది. సినిమాలో రామ్‌చరణ్ కొత్తగా కనిపిస్తాడు. శ్రీకాంత్ ఇందులో రామ్‌చరణ్‌కి యంగ్ బాబాయిగా కనిపిస్తారు. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయి. తమిళ నటుడు రాజ్‌కిరణ్ పాత్ర చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాగర్‌కోయిల్, పొల్లాచ్చిలోనూ చిత్రీకరణ జరుపుతాము''అన్నారు.
కృష్ణవంశీ మాట్లాడుతూ... తాను ప్రస్తుతం రామ్ చరణ్ తో 'మురారి' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసే పనిలో ఉన్నానని కృష్ణ వంశీ చెప్పుకొచ్చారు తండ్రిగా నాగార్జునని అడుగుతున్నారని తెలుస్తోంది. తాతగా రాజ్ కిరణ్ కనిపించనున్నాడు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు బండ్ల గణేష్. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.


Click it and Unblock the Notifications











