రామ్ చరణ్ ద్వారా... కో అంటే కోటి ఆడియో
హైదరాబాద్: హీరో శర్వానంద్ నటిస్తున్న 'కో అంటే కోటి' చిత్రం ఆడియో ఈ నెల 8న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం..ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరవుతున్నారని, ఆయన చేతనే ఆడియో ఆవిష్కరణ జరుగనున్నట్లు సమాచారం.
ఈ చిత్రం ద్వారా శర్వానంద నిర్మాతగా మారాడు. శర్వా ఆర్ట్స్ బేనర్‌పై ఈచిత్రాన్ని నిర్మించారు. ఈ నేపథ్యంలో తన క్లోజ్ ఫ్రెండ్ అయిన రామ్ చరణ్‌ను కూడా ఈ వేడుకకు ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఆవకాయ బిర్యాని దర్శకుడు అనీష్ కురువిల్లా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ప్రియా ఆనంద్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం డబ్బు చుట్టూ తిరగే కథ. శ్రీహరి కీలక పాత్ర పోషించారు.
'కో అంటే కోటి' చిత్ర టీజర్ కి అద్భుతమయిన స్పందన వచ్చింది. ఈ టీజర్లో మొదటి డైలాగ్ 'బ్రతకాలి అంటే బలుపు కావాలి అది నా దగ్గర చాలా ఉంది' జనాన్ని ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ టీజర్ లో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా సినిమాటోగ్రఫీ చాలా విభిన్నంగా ఉంటూ ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి.
ఈ చిత్రానికి శక్తికాంత్ సంగీతం అందించారు. ఎరుకుల్ల రాకేష్, నవీన్ సినిమాటోగ్రాఫర్లుగా పని చేసారు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, తన గత చిత్రాల్లాగే ఈ చిత్రం కూడా మంచి పేరు తెస్తుందని శర్వనంద్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











