»   » రామ్ చరణ్ తేజ్ ఆస్ట్రేలియా షెడ్యూల్ డిటేల్స్

రామ్ చరణ్ తేజ్ ఆస్ట్రేలియా షెడ్యూల్ డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ తేజ్ ఈ రోజు(సోమవారం) ఆస్ట్రేలియాలో ల్యాండ్ అయ్యాడు. అక్కడ నెల రోజులు పాటు కంటెన్యూ షెడ్యుల్ జరుగుతుంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఆరెంజ్ అని వర్కింగ్ టైటిల్ వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్స్ పై నాగబాబు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంభందించిన కీలక సన్నివేశాలు ఆస్ట్రేలియాలో షూట్ చేస్తున్నారు. బొమ్మరిల్లు తర్వాత భాస్కర్ దర్శకత్వంలో జెనీలియా చేస్తున్న చిత్రం ఇది. అలాగే ఈ చిత్రానికి సంగీతం హరీష్ జయరాజ్ అందిస్తున్నారు. మగధీర వంటి మెగా హిట్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న చిత్రం కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu