»   » రాంచరణ్, ఉపాసన స్టైలిష్ ఫోటో.. 5 కేజీల బరువు వదిలించుకున్నాడట!

రాంచరణ్, ఉపాసన స్టైలిష్ ఫోటో.. 5 కేజీల బరువు వదిలించుకున్నాడట!

Subscribe to Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం రంగస్థలం చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఏడాది పాటు రంగస్థలం చిత్రం కోసం చరణ్ కష్టపడ్డాడు. అది మామూలు కష్టం కాదు. పొడవాటి గడ్డం పెంచుకుని రఫ్ లుక్ లో ఏడాది పాటు చరణ్ కనిపించాడు. చిట్టిబాబు పాత్ర కోసం చరణ్ పడ్డ కష్టం వెండి తెరపై అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. తాజాగా తన సతీమణి ఉపాసనతో ఉన్నా స్టైలిష్ ఫోటోని రాంచరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ సందర్భంగా చరణ్ ఆసక్తికర కామెంట్ చేయడం విశేషం. హెయిర్ కటింగ్ మరియు ట్రిమ్మింగ్ తరువాత ఐదు కేజీల తగ్గినట్లు ఉందని చరణ్ చిట్టిబాబు గెటప్ గురించి వ్యాఖ్యలు చేసాడు. ఏడాది పాటు పొడవాటి గడ్డం భరించడం చాలా చికాకుతో కూడుకున్న పని. కానీ చిట్టిబాబు పాత్ర కోసం ఆ గడ్డాన్ని చెర్రీ భరించాడు.

ట్రిమ్మింగ్ తరువాత రాంచరణ్ మళ్ళీ స్టైలిష్ లుక్ లోకి వచ్చేశాడు. మెగా అభిమానులని చెర్రీ లేటెస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. రాంచరణ్ నయా లుక్ బోయపాటి సినిమా కోసమే. రంగస్థలం చిత్రం చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రంగస్థలం చిత్రం కళ్ళు చెదిరే వసూళ్లతో దూసుకుపోతోంది.

English summary
Ram Charan looks stylish in his new avatar. He feels 5kg lighter after trim
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X