»   » రామ్ చరణ్ చిత్రం 3D లోకి కన్వర్ట్ చేస్తున్నారు

రామ్ చరణ్ చిత్రం 3D లోకి కన్వర్ట్ చేస్తున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ తాజా చిత్రం మగధీర త్వరలో త్రీడి లోకి మారనుంది. సినిమాటికా డిజిటల్స్ ప్రెవేట్ లిమిటెడ్ వారు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా సినిమాటికా డిజిటల్స్ సంస్ధ ఎండి అల్లు వెంకటేష్ మాట్లాడుతూ...పైరసీని నిరోధించటానికి త్రీడి ఫార్మెట్ ఓ సాధనంగా భావిస్తున్నాం. ఘన విజయం సాధించిన మగధీర చిత్రాన్ని త్రీడి డిజిటల్ ప్రొజక్షన్ సిస్టమ్ పార్మెట్ లోకి మారుస్తున్నాం.ఇందుకోసం మెదటి ఫేజ్ గా త్రీడి చిత్రాల ప్రదర్సన కోసం ఆంధ్రప్రదేశ్ లోని ఎంపిక చేసిన పది ధియోటర్స్ లోకి మార్పులు చేయబోతున్నాం. ఈ రోజుల్లో హాలీవుడ్ లో చాలా చిత్రాలు త్రీడి ఫార్మెట్ లో రెడీ అవుతున్నాయి. మొదటి విడతగా అరుంధతి, మగధీరని త్రీడిలోకి కన్వర్ట్ చేసి చూసాం. మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఈ దిసగా మరింత మెరగైన ప్రయత్నాలు రాబోయే రోజుల్లో చేస్తాము అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu