»   »  అది రామ్ చరణ్ వదులుకున్న బంగారమేనా?

అది రామ్ చరణ్ వదులుకున్న బంగారమేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓకే బంగారం' చిత్రం విడుదలై మంచి రొమాంటిక్ మూవీగా పేరు తెచ్చుకుంది. చాలా కాలం తర్వాత మణితర్నం ఈ సినిమాతో విజయం అందుకున్నారు. మమ్ముటి తనయుడు దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ ఈ చిత్రంలో జంటగా నటించారు. లివ్ ఇన్ రిలేషన్ షిప్, లవ్ అంశాలను బేస్ చేసుకుని ఎంతో బ్యూటిఫుల్ గా ఈ లవ్ స్టోరీని తెరకెక్కించాడు మణిరత్నం. యువతను ఈచిత్రం ఎంతగానో ఆకట్టుకుంటోంది.

వాస్తవానికి ఈ చిత్రం...రామ్ చరణ్‌తో చేయాల్సింది అంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు. అయితే రామ్ చరణ్ ఈ సినిమా చేయడానికి నో చెప్పడంతో మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ ఈ సినిమా చేసే అవకాశం దక్కిందని అంటున్నారు. గతంలో ఓ సారి మణిరత్నం, సుహాసిని స్వయంగా వచ్చి చిరంజీవి, రామ్ చరణ్ లను కలిసారు.

Ram Charan missed Ok Bangaram?

అప్పట్లో మణిరత్నం దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అప్పటికే ‘ఆరెంజ్' లవ్ స్టోరీతో దెబ్బతిని ఉన్న రామ్ చరణ్ మాస్ ఎలిమెంట్స్ లేకుండా సినిమా చేయడానికి సాహసం చేయలేక పోయాడు. అందుకే మణిరత్నం చెప్పిన స్టోరీ (ఇప్పటి ఓకే బంగారం)ని చేయడానికి నిరాకరించాడట. చిరంజీవి సూచన మేరకే రామ్ చరణ్ ఈ స్టోరీని తిరస్కరించాడని టాక్.

English summary
Maniratnam narrated the story of OK Bangaram to Ram Charan an year ago but the actor refused it.
Please Wait while comments are loading...