twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ ‘నాయక్’ కి నేడే ఆ ముచ్చట

    By Srikanya
    |

    హైదరాబాద్ : రామ్ చరణ్ తాజా చిత్రం 'నాయక్'కి ఈ రోజే సెన్సార్ జరగనుంది. సెన్సార్ పూర్తికాగానే పబ్లిసిటీ క్యాంపైన్ జోరందుకోనుంది. రామ్ చరణ్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, అమలాపాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించారు. ఇప్పటికే ఎస్.ఎస్ తమన్ అందించిన ఈ చిత్రం ఆడియో అభిమానులను అలరిస్తోంది.

    అలాగే ... నా జోలికి వస్తే క్షమిస్తాను కానీ...నా వాళ్ల జోలికి వస్తే నరికేస్తాను... అంటూ రామ్ చరణ్ చెప్పిన డైలాగు కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న ఈ చిత్రం ట్రైలర్ కూడా మంచి ఆందరణ పొందాయి. ముఖ్యంగా... ఏరియా బట్టి మారడానికి ఇది క్లైమేట్ కాదు...కరేజ్, ప్రభత్వం కోసం ప్రజలు ఉండరు..ప్రజలు కోసమే ప్రభుత్వం ఉండాలి, నా జోలికి వస్తే క్షమిస్తాను కానీ...నా వాళ్ల జోలికి వస్తే నరికేస్తాను... వంటి డైలాగ్స్ చరణ్ అభిమానులను ఓ రేంజిలో అలరిస్తున్నాయి.

    మాస్ హీరోయిజాన్ని చాలా పవర్‌ఫుల్‌గా, హార్ట్ టచింగ్‌గా ప్రెజెంట్ చేయడంలో వినాయక్‌ది అందె వేసిన చేయి. చిరంజీవిని 'ఠాగూర్'గాను, అల్లు అర్జున్‌ని 'బన్నీ'గాను, 'బద్రినాథ్'గానూ ఆవిష్కరించిన వినాయక్ ప్రస్తుతం రామ్‌చరణ్‌ని 'నాయక్'గా తీరిదిద్దారు. అన్ని హంగులూ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 9న విడుదలకు సన్నాహాలు జరుపుకుంటోంది.

    'మగధీర' తర్వాత రామ్‌చరణ్ సరసన కాజల్ అగర్వాల్ నటించిన సినిమా ఇది. రామ్‌చరణ్, వినాయక్ చిత్రానికి తమన్ స్వరాలందించడం ఇదే ప్రథమం. ఇటీవల విడుదలైన పాటలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవి ఒకప్పటి హిట్ సినిమా 'కొండవీటి దొంగ'లోని ప్రాచుర్య గీతం 'శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో..'ను ఇందులో రీమిక్స్ చేసి రామ్‌చరణ్, అమలాపాల్‌పై చిత్రీకరించారు. ఇందులో ఛార్మి ఓ పాటలో ఐటమ్‌గాళ్‌గా చేసింది. 'ఒయ్యారమంటే ఏలూరే..' పాటను రామ్‌చరణ్, ఛార్మిపై చిత్రీకరించారు

    . ఆకుల శివ మంచి స్క్రిప్ట్ ఇచ్చారని, వినాయక్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని, రామ్‌చరణ్ తన మెగా పెర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తారని నిర్మాత చెప్పారు. యూనివర్శల్ మీడియా పతాకంపై ఎస్. రాధాకృష్ణ సమర్పలో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌రావత్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్‌ సాయి, సంగీతం: తమన్‌.

    English summary
    Ram Charan’s upcoming film Nayak’s post production is going on at full swing and the latest news is that Nayak will be censored on January 3.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X