For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రామ్ చరణ్ 'నాయక్' సెన్సార్ కట్స్ ఇవే

  By Srikanya
  |

  హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం నాయక్ . ఈ చిత్రం సెన్సార్ పూర్తైంది. ఈ చిత్రానికి కొద్ది పాటి కట్స్ తో సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని యూనివర్సల్‌ మీడియా సంస్థ నిర్మిస్తోంది. డి.వి.వి.దానయ్య నిర్మాత. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు.

  చిత్రంలో సెన్సార్ చెప్పిన కట్స్ ఇవే.

  1. అసెంబ్లోలో అపోజిషన్ వాళ్ళు బూతులు తిడతారు. మైకులు లేవా తీసి కొట్టు. బల్లలు లేవా విరగ్గొట్టు... రాజకీయాల్లోకి కొత్త రక్తం కావాలంటే ఏంటో తెలుసా...బాడీ బిల్డర్లు కావాలి...అని పోసాని చెప్పని డైలాగుని తీసేయమన్నారు.

  2. ఐటం సాంగ్ లో వచ్చే యవ్వారం, మిడ్డీ ఒడ్డై,తడి పొడి, వంటి పదాలు తొలిగించమన్నారు.

  3. దీనిమ్మ, లిప్ స్టిక్, ఎన్ డి తివారి, ఎపి గవర్నర్, అబ్దుల్ కలామ్, సర్వేపల్లి రాధాకృష్ణ.. పదాలను డైలాగులనుంచి తొలిగించమన్నారు.

  4. నాయక్ సినిమా టైటిల్ మీద కొందరు గిరిజన నాయకుల వేసిన కేసు విషయమై... ఎవరినీ నాయక్ అనే సినిమా పేరు కించపరిచేలా లేదని, దాన్ని మార్చాల్సిన అవసరం లేదని సెన్సార్ బోర్డ్ తేల్చి చెప్పింది.

  5. పొగ త్రాగుట,మద్యం సేవించట ఆరోగ్యానికి హానికరం అనే చట్టబద్దమైన హెచ్చరిక సినిమాలో మధ్య,ధూమపాన సీన్స్ వచ్చినప్పుడల్లా వేయాలి.

  6. పోస్టర్స్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఇలా అన్ని పబ్లిసిటీ మెటీరియల్, మీద ఎ సర్టిఫికేట్ కనపడేలా ప్రచురించాలి.

  'మగధీర' తర్వాత రామ్‌చరణ్ సరసన కాజల్ అగర్వాల్ నటించిన సినిమా ఇది. రామ్‌చరణ్, వినాయక్ చిత్రానికి తమన్ స్వరాలందించడం ఇదే ప్రథమం. ఇటీవల విడుదలైన పాటలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవి ఒకప్పటి హిట్ సినిమా 'కొండవీటి దొంగ'లోని ప్రాచుర్య గీతం 'శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో..'ను ఇందులో రీమిక్స్ చేసి రామ్‌చరణ్, అమలాపాల్‌పై చిత్రీకరించారు. ఇందులో ఛార్మి ఓ పాటలో ఐటమ్‌గాళ్‌గా చేసింది. 'ఒయ్యారమంటే ఏలూరే..' పాటను రామ్‌చరణ్, ఛార్మిపై చిత్రీకరించారు

  ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌ రెడ్డి, రాహుల్‌ దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌ రావత్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్‌ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.

  English summary
  Ram Charan’s mass entertainer ‘Nayak’ has received an A certificate from the censors, now we present you the complete censor cut details for which this movie was given an A.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X